తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం
Actor ProfileCelebrity

తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం
AP7AM22 Dec 2026
తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం

గోల్కొండ కోటలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం భారత స్వాతంత్య్ర పోరాటమని అన్నారు. అహింసతోనూ విజయాన్ని సాధించవచ్చని మహాత్మాగాంధీ నిరూపించారని చెప్పారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు.స్వాతంత్య్రం జీవనానికి ఆధారమని, దానికి వెల కట్టలేమని గాంధీజీ చెప్పారని రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం ద్వారా దేశంలోని వివిధ రంగాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు కృషి చేశాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను అందించడంతో పాటు విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నామని చెప్పారు. తమ సంక్షేమ పథకాలను కేవలం ఆర్థిక లెక్కలతో చూడటం లేదని స్పష్టం చేశారు. సంక్షేమంలో మానవీయత ఉందని, పేదల పట్ల బాధ్యత ఉందని అన్నారు. వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపనతో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఓట్ల కోసం లేదా మొక్కుబడిగా సంక్షేమాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.32 నెలల్లో ప్రభుత్వం చేసిన కృషి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ

త ల గ ణన వ ధ వ స న చ వ క స వ ప నడ ప స త న న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in