తొలగని ప్రతిష్టంభన
Actor ProfilePolitician

తొలగని ప్రతిష్టంభన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తొలగని ప్రతిష్టంభన
Sakshi17 Nov 2026
తొలగని ప్రతిష్టంభన

జార్ఖండ్‌లో విద్యార్థి ఉద్యమకారులతో రెండూ రోజూ కొనసాగిన ప్రభుత్వ చర్చలు రాంచీ: చర్చలకు జార్ఖండ్‌ ప్రభుత్వం ముందుకొచ్చినా సరే తమ ఉద్యమపంథాను వీడేదిలేదని జార్ఖండ్‌లో పరీక్షల సంస్కరణల కోసం ఉద్యమిస్తున్న పరీక్షార్థులు పునరుద్ఘాటించారు. శుక్రవారం పది మంది సభ్యుల ప్రతినిధి బృందంతో మొదలైన చర్చలు శనివారం సైతం కొనసాగాయి. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి కన్పించలేదు. జార్ఖండ్‌ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ వారి 14వ పరీక్షను రద్దుచేయాలన్న డిమాండ్‌సహా ప్రధాన డిమాండ్లకు సానుకూలంగా ఐదుగురు మంత్రుల ప్రతినిధి బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో రెండో రోజూ చర్చలు సత్ఫలితాలివ్వలేదని తెలుస్తోంది. తమ డిమాండ్లను నెరవేర్చేదాకా రాంచీలోని జైపాల్‌సింగ్‌ ముండా స్టేడియంలో తమ నిరాహార దీక్షలు ఆగవని జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల మంచ్‌ శనివారం ప్రకటించింది. శనివారం చర్చలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ బృందం దీక్షాస్థలికి వచ్చి కొద్దిరోజులుగా నిరాహార దీక్షచేస్తున్న ఉద్యమనేత దేవేంద్ర నాథ్‌ మహతోను కలిసి మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్‌ మద్దతున్న ఎన్‌ఎస్‌యూఐ, ఏఎస్‌ఎస్, జేసీఎం విద్యార్థి సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం విడిగా భేటీ అయింది. ‘‘ఉద్యమిస్తున్న పరీక్షార్థుల డిమాండ్లలో వాస్తవికత దాగిఉంది. ఈ డిమాండ్లను ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు నివేదించాం’’అని భేటీ తర్వాత మంత్రి సంజయ్‌ ప్రసాద్‌ యాదవ్‌ మీడియాతో చెప్పారు. ‘‘సీఎంతో నాలుగు గంటలపాటు చర్చించాం. ఉద్యమనేతలతో ఇప్పటికే ఐదు విడతల చర్చలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం ఆరో విడత చర్చిస్తాం’’అని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండే సింగ్‌ తెలిపారు. ‘‘14వ జేపీఎస్సీ పరీక్ష రద్దు, గత పరీక్షలపై 90 రోజుల్లోపు సీఐడీ విచారణ, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తరహాలో జార్ఖండ్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాటు ఇలా ఆరు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుపెట్టామని జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల మంచ్‌ అధికార ప్రతినిధి సంజీవ్‌ షా తెలిపారు. మరోవైపు విద్యార్థుల ఉద్యమం శనివారం 15వరోజుకు చేరింది. స్టేడియంలో పెద్దసంఖ్యలో విద్యార్థి సంఘా నేతలు, ఉద్యమకారులు