త్రిముడి’ అని పెట్టొచ్చుగా.. ఇరుముడి’ టైటిల్
Actor ProfileActor

త్రిముడి’ అని పెట్టొచ్చుగా.. ఇరుముడి’ టైటిల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
త్రిముడి’ అని పెట్టొచ్చుగా.. ఇరుముడి’ టైటిల్ పై కొత్త వివాదం
Chitrajyothy14 Dec 2026
త్రిముడి’ అని పెట్టొచ్చుగా.. ఇరుముడి’ టైటిల్ పై కొత్త వివాదం

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలు ట్రైలర్‌లో ఆకట్టుకోవడంతో రవితేజ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే సినిమా టైటిల్‌పై వివాదం కూడా మొదలైంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ ‘ఇరుముడి’ టైటిల్ వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. ఇది పూర్తిస్థాయి భక్తి కథ కాదని, తండ్రీకూతుళ్ల బంధం, అయ్యప్ప భక్తుడి విశ్వాసం, క్రైమ్ మిస్టరీ.. ఇలా మూడు విభిన్న కోణాలు సినిమాలో ఉంటాయని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ కలిపే భావనతో ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను పెట్టినట్లు చెప్పారు. దర్శకుడి వివరణపై అయ్యప్ప స్వామి భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శబరిమల యాత్రలో అత్యంత పవిత్రంగా భావించే ఇరుముడి పేరును క్రైమ్ మిస్టరీతో కూడిన కథకు ఉపయోగించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. సినిమాలో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయని దర్శకుడు చెబుతున్నప్పుడు ‘త్రిముడి’ వంటి మరో పేరును పెట్టొచ్చు కదా? పవిత్రమైన ‘ఇరుముడి’ పేరునే ఎందుకు ఎంచుకున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. టైటిల్‌పై అభ్యంతరాలు సెన్సార్ ప్రక్రియపై ప్రభావం చూపుతాయా? చిత్రబృందం టైటిల్‌లో ఏమైనా మార్పులు చేస్తుందా? లేదా వివాదాలను పట్టించుకోకుండా ఇదే పేరుతో సినిమా విడుదల చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సినిమా చూసిన తర్వాతే టైటిల్ ఉద్దేశం, దాని ప్రాధాన్యత స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ట్రైలర్‌కు వస్తున్న సూపర్ రెస్పాన్స్.. మరోవైపు టైటిల్‌పై మొదలైన వివాదం

త ర మ డ అన ప ట ట చ చ గ ఇర మ డ ట ట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in