తిరుమల శ్రీవారికి నయనతార తలనీలాలు సమర్పించారా? ఫొటోస్ వైరల్.. అసలు విషయమిదే
Actor ProfileActor

తిరుమల శ్రీవారికి నయనతార తలనీలాలు సమర్పించారా? ఫొటోస్ వైరల్.. అసలు విషయమిదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుమల శ్రీవారికి నయనతార తలనీలాలు సమర్పించారా? ఫొటోస్ వైరల్.. అసలు విషయమిదే
TV9 Telugu11 Jan 2027
తిరుమల శ్రీవారికి నయనతార తలనీలాలు సమర్పించారా? ఫొటోస్ వైరల్.. అసలు విషయమిదే

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన 'టాక్సిక్' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈలోగా ఈ స్టార్ హీరోయిన్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో పూర్తి గుండుతో ఉన్న నయనతార ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది మంది వీటిని చూసి నయనతార నిజంగానే తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిందనుకున్నారు. అయితే ఈ వైరల్ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉంది. అదేంటంటే.. ఈ ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి మార్ఫింగ్ చేశారు. గతంలో తిరుమలకు వెళ్లిన నయనతార పాత ఫొటోలను ఎడిట్ చేశారు నెట్టింట వైరల్ చేశారు. నయనతార ఈ ఏడాది ఏప్రిల్‌లో తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి తిరుమలను సందర్శించారు. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా విడుదలకు ముందు ఈ దంపతులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో నయనతార తెలుపు రంగు కుర్తా, లెగ్గింగ్స్‌తో పాటు ఆకుపచ్చ రంగు దుపట్టాలో కనిపించారు. అయితే అప్పటి ఫొటోలను తీసుకుని నయనతార తలనీలాలు సమర్పించినట్లుగా ఏఐ టెక్నాలజీతో మార్చి, ఆ వీడియో, ఫోటోలను నెట్టింట వైరల్‌ చేశారు. కాగా గతంలోనూ చాలా మంది హీరోయిన్ల ఫొటోలను ఇలాగే ఎడిట్ చేసి వైరల్ చేశారు కొందరు నెటిజన్లు. రష్మిక మందన్నా, అలియా భట్, రుక్మిణి వసంత్ తదితర స్టార్ హీరోయిన్ల ముఖాలు, శరీరాలను అశ్లీల ఫొటోలు, వీడియోలకు జోడిస్తూ డీప్ ఫేక్ విజువల్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నయనతార విషయంలోనూ అదే జరిగింది. ఈ క్రమంలో ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను నమ్మవద్దని అలాగే షేర్ కూడా చేయవద్దని నయనతార అభిమానులు కోరుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార నటించిన టాక్సిక్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.యశ్ ఇందులో హీరోగా నటించాడు. దీని తర్వాత సల్మాన్ ఖాన్ చిత్రంలో నయనతార

త ర మల శ ర వ ర క నయనత ర తలన ల ల సమర ప చ ర ఫ ట స వ రల అసల వ షయమ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in