
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ttd big update on November month arjitha seva quota release: తిరుమలలో భక్తులకు టీటీడీ భారీ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా నవంబర్ మాసంకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టోకెన్లు, వసతి మొదలైన షెడ్యూల్ విడుదలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తులు ఈ తేదీలను గమనించి, టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలని కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) విధానంలో టికెట్లను కేటాయించనున్నారు. దీనిన కోసం భక్తులు ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. లక్కీ డిప్‌లో టిక్కెట్లు పొందిన భక్తులు ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నంలోగా నిర్ణీత రుసుము చెల్లించి తమ టిక్కెట్లను ఖరారు చేసుకోవాలని సూచించింది. దీనితో పాటు ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం కు సంబంధించిన టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తామని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనితో పాటు ఇతర సేవా టికెట్లను ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవా , ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం