తిరుమలలో అమాంతం పెరిగిన రద్దీ.. క్యూలైన్ లలో భక్తుల్ని అనుమతించని టీటీడీ
Actor ProfilePolitician

తిరుమలలో అమాంతం పెరిగిన రద్దీ.. క్యూలైన్ లలో భక్తుల్ని అనుమతించని టీటీడీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుమలలో అమాంతం పెరిగిన రద్దీ.. క్యూలైన్ లలో భక్తుల్ని అనుమతించని టీటీడీ
Zee Telugu28 Oct 2026
తిరుమలలో అమాంతం పెరిగిన రద్దీ.. క్యూలైన్ లలో భక్తుల్ని అనుమతించని టీటీడీ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Heavy devotees crowd in Tirumala: కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారం తిరుమల శ్రీవారిని దర్శించుకొవడానికి భక్తులు పొటెత్తారు. ఒకవైపు వీకెండ్ , వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో రద్దీ విపరీతంగాపెరిగిపోయింది. తిరుమల కొండంతా భక్తుల గోవిందనామ స్మరణతో మార్మోగిపోయింది. తిరుమలలోని 31 కంపార్ట్ మెంట్ లు భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో టీటీడీ క్యూలైన్ లలో భక్తులను అనుమతించడంను తాత్కాలికంగా నిలిపివేసింది. రుయా ఆస్పత్రి కూడలి నుంచి ఇస్కాన్ ఆలయం మీదుగా బస్టాండ్ కు వాహనాల మళ్లింపు చేపట్టారు. అదే విధంగా.. అలిపిరి నుంచి గరుగ కూడలి వరకు వాహనాలు కిలోమీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరాయి. గరుడ కూడలి నుంచి వెళ్లాల్సిన వాహనాల్ని అన్నారావు కూడలి నుంచి బస్టాండ్ వైపు తరలిస్తున్నారు. మరోవైపు ఈరోజు ఉదయం ఎస్ ఎస్ డీ టోకెన్లను ఉదయం 10 కి ఇచ్చే వారు కాస్త..విపరీమైన రద్దీతో 5 గంటలకే భక్తులకు అందజేశారు. రద్దీ నేపథ్యంలో తిరుమల దర్శనాలకు వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచించింది. అలిపిరి మెట్ల మార్గంలో వచ్చే భక్తులు చిరుత పులి కన్పించిన నేపథ్యంలో గుంపులు, గుంపులుగా మెట్ల నుంచి నడవాలని టీటీడీ విజిలెన్స్ భక్తులకు సూచించింది. తిరుమలలో టోకెన్లు లేని సర్వదర్శనాలకు ప్రస్తుతం 28 గంటల సమయం పడుతుంది. రూ. 300 దర్శనాలకు 6 గంటలు, ఎస్ఎస్ డీ టోకెన్లు ఉన్న భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది

త ర మలల అమ త ప ర గ న రద ద క య ల న లల భక త ల న అన మత చన ట ట డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in