తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీవ్రతం
Actor ProfilePolitician

తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీవ్రతం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీవ్రతం- మహిళలకు టీటీడీ కానుక
Oneindia Telugu12 Dec 2026
తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీవ్రతం- మహిళలకు టీటీడీ కానుక

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21వ తేదీన వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం ఆగమోక్తంగా నిర్వహించనున్నారు అర్చకులు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వేలాదిమంది భక్తులు ఈ వ్రతంలో పాల్గొనే అవకాశం ఉండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.స్కంద, భవిష్యోత్తర పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రత విశిష్టత, ఆచరించే విధానాన్ని వివరించినట్లు అర్చకులు తెలిపారు. శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాశస్త్యం ఉంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించే మహిళలకు సత్సంతానం, దీర్ఘ సుమంగళీ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని విశ్వసిస్తారు.వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గం.లకు ఆన్ లైన్ లో టికెట్లను విడుదల చేయనున్నారు. ఆఫ్ లైన్ టికెట్లను ఒక రోజు ముందు ఆలయం సమీపంలో గల కౌంటర్ లో అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ ఆలయంలో పర్యటించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆదేశాలు ఇచ్చారు.తిరుమలలో అరుదైన ఘట్టం: సేవల విషయంలో భక్తులకు గమనికభక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్‌సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు, పందిర్లు, సూచిక బోర్డులు, ఎల్‌ఈడీ

ఈ తెల్లవారు జామున భారీ భూకంపం
Oneindia Telugu12 Dec 2026
ఈ తెల్లవారు జామున భారీ భూకంపం

కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. కొన్ని చోట్ల నివాసాలు

త ర చ న ర ఆలయ ల వరలక ష మ వ రత Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in