తారక్ ఆరోగ్యం
Actor ProfileActor

తారక్ ఆరోగ్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తారక్ ఆరోగ్యంపై డాక్టర్ల క్లారిటీ.. డ్రాగన్ రిలీజ్ డేట్ తో ప్రశాంత్ నీల్ సర్ ప్రైజ్
Zee Telugu13 Jan 2027
తారక్ ఆరోగ్యంపై డాక్టర్ల క్లారిటీ.. డ్రాగన్ రిలీజ్ డేట్ తో ప్రశాంత్ నీల్ సర్ ప్రైజ్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. NTR Health Update: ఎన్.టి.ఆర్. అభిమానులను కొంతకాలంగా ఆందోళనకు గురిచేస్తున్న ఆయన భుజం గాయంపై తాజాగా స్పష్టత వచ్చింది. షూటింగ్ సమయంలో కుడి భుజానికి గాయం కావడంతో తారక్‌కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ, కోలుకునే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తారక్‌కు అందించిన చికిత్స, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు. కుడి భుజం జాయింట్ ప్రాంతంలో గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తారక్ ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తారక్ రికవరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, వైద్యుల సూచనలను పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన అంకితభావాన్ని చూస్తుంటే త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాత సుమారు రెండు నెలల్లో షూటింగ్‌లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో అభిమానుల్లో నెలకొన్న ఆందోళన కొంత తగ్గింది. తారక్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తారక్ నటిస్తున్న డ్రాగన్ సినిమాపై కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ‘డ్రాగన్’కు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు

త రక ఆర గ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in