
Bharat Bhhagya Viddhaata: 26/11 దాడుల గురించి మనం ఎన్నో కథలు విన్నాం. ఒకవైపు ముంబై నగరం ఉగ్రవాదుల కాల్పులతో వణికిపోతోతుంటే ప్రజల హాహాకారాల మధ్య నగరం అట్టుడికిపోయింది. సైనికులు, పోలీసులు కూడా ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలో బయటకు అంతగా వినిపించని మరో సాహసం కూడా ఉంది. వైద్యులు, నర్సులు, వార్డ్ సిబ్బంది సిబ్బంది రోగులకోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వెనుక ఒళ్ళు జలదరించే విషయాలు ఉన్నాయి. కామా, అల్బ్లెస్ ఆసుపత్రి గోడల మధ్య జరిగిన ఈ అజ్ఞాత వీరుల పోరాటం గురించి వెలుగులో తెచ్చిన సినిమానే కంగనా నటించిన ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhhagya Viddhaata). 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రదాడులు ఇండియన్ హిస్టరీలోనే అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయాయి. ఉగ్రవాదులు నగరంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన సమయంలో భద్రతా దళాలు ప్రాణాలకు తెగించి పోరాడాయి. అయితే ఆ భయానక రాత్రిలో మరోచోట కూడా నిశ్శబ్దంగా ఒక యుద్ధం సాగింది. ముంబైలోని కామా, అల్బ్లెస్ ఆసుపత్రిలో ఉన్న రోగులను కాపాడేందుకు అక్కడి సిబ్బంది ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కొన్నారు. ఆయుధాలు లేకపోయినా, తమ ముందు ఉన్న ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ‘భారత్ భాగ్య విధాత’ మూవీలో ఈ సాహసాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఈ మూవీ 2026 జూన్ 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇప్పుడు ఓటీటీలోకి కూడా అడుగు పెట్టబోతోంది. థియేటర్లలో చూడని వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే ఈ థ్రిల్లర్ మూవీని చూసేయచ్చు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన “భారత్ భాగ్య విధాత” సినిమా కథ 2008లో జరిగిన 26/11 ముంబై ఉగ్రదాడుల యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మూవీ ముంబైలోని కామా హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఉగ్రవాదులు హాస్పిటల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుని రక్తపాతం సృష్టిస్తున్న ఆ