
Eenadu•28 Dec 2026
తృణమూల్ నేత అనుమానాస్పద మృతిమమతా బెనర్జీకి సన్నిహితుడు, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో పార్టీ కార్యాలయంలో మృతి చెందారు. ఆయన మృతదేహం కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాంపూర్హట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తృణమూల్ నేత అనుమానాస్పద మృతి