
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Inspiring Woman Auto Driver News: సమాజంలో ఎంత మార్పు వచ్చినా.. ఆడపిల్లల సామర్థ్యాల పట్ల కొన్ని అపోహలు ఇంకా కొనసాగుతూనే వస్తున్నాయి. కానీ, ఆ అపోహలన్నింటినీ ఏ మాత్రం లెక్కచేయకుండా.. సవాళ్లను ఎదురు నిలించింది ఒక యువతి... కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చడానికి తానే.. ఒక సైన్యమై కదిలింది. ఆటో డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆటో పట్టి దూసుకుపోతోంది బట్టి సరస్వతి.. ఇంట్లో మగ దిక్కు లేకపోయినా.. తానే ఆ ఇంటికి పెద్ద కొడుకుగా మారి ముగ్గురు ఆడపిల్లల కుటుంబాన్ని సాకుతున్న ఈ యువతి కథ ప్రతి ఒక్కరినీ కదిలిస్తూనే.. కొండంత ధైర్యాన్ని ఇస్తోంది.. కన్నతండ్రి దూరమైనా.. మహబూబాబాద్ పట్టణంలోని గాయత్రీ గుట్ట కాలనీకి చెందిన బట్టి సరస్వతి జీవితం మొదటి నుంచి పూలబాట ఏమీ కాదు.. ఆ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు.. వారు ఇంకా లోకం తెలియని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే.. కన్నతండ్రి వారిని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ తల్లి తన ముగ్గురు ఆడపిల్లలను రెక్కల కష్టం చేస్తూ.. సాకుతూ వచ్చింది. కానీ రోజులు గడిచేకొద్దీ ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా పెరిగాయి. ఇంట్లో సంపాదించే.. మగ దిక్కు లేకపోవడం.. కేవలం ఆడపిల్లలే ఉండటంతో సమాజం నుంచి కూడా ఆ కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు, అవహేళనలు ఎదురయ్యాయి. భిన్నమైన మార్గం.. కుటుంబ పరిస్థితులు చూసి సరస్వతి చలించిపోయింది.. ఎలాగైనా తన తల్లికి, సోదరీమణులకు అండగా నిలవాలని నిశ్చయించుకుంది. సాధారణంగా మహిళలు