తగిన చర్యలు ఉంటాయి
Actor ProfilePolitician

తగిన చర్యలు ఉంటాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తగిన చర్యలు ఉంటాయి
Andhra Jyothy7 Nov 2026
తగిన చర్యలు ఉంటాయి

ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్ వివాదంపై మెటా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి వివరణ పంపింది. ఆ నివేదికను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు. న్యూఢిల్లీ: ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులకు సంబంధించిన అసభ్యకర వీడియోలు, చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనల వివాదంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తోంది. ఈ వ్యవహారంపై మెటా సంస్థ పంపిన వివరణ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు చేరగా, దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు. మెటా సమర్పించిన నివేదికను అన్ని కోణాల్లో పరిశీలించిన అనంతరం అవసరమైతే తదుపరి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ప్రకటనలపై గతంలో కేంద్ర ప్రభుత్వం మెటాకు కఠిన నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని, ఇటువంటి కంటెంట్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీనికి స్పందించిన మెటా సంస్థ.. బాలల రక్షణకు AI సాంకేతికతను వినియోగిస్తున్నామని వెల్లడించింది. అలాగే యాడ్ రివ్యూ ప్రక్రియను మరింత బలోపేతం చేస్తామని తన వివరణలో పేర్కొంది. ఒడిశాలో విషాదం.. మొబైల్‌తో కొట్టిన భార్య.. భర్త మృతి విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట.. గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే!

తగ న చర యల ఉ ట య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in