
ఒకప్పుడు కాశ్మీర్ అనగానే ముందుగా యాపిల్ తోటలు గుర్తుకొచ్చేవి. ఆ తర్వాత కుంకుమపువ్వు ఫేమస్ అయ్యేది. కానీ.. ఇప్పుడు కాశ్మీర్ రైతులు తమ ఆలోచనను మార్చుకున్నారు. మరో కొత్త రకం వ్యవసాయానికి తెరలేపారు. చాలా మంది రైతులు యాపిల్ సాగు తగ్గించి.. దాని స్థానంలో లావెండర్ సాగుపై శ్రద్ధ చూపుతున్నారు. ఈ పంటకు తక్కువ పెట్టుబడి పెట్టినా.. లాభాలు మాత్రం ఎక్కువ స్థాయిలో వస్తుండటంతో.. అందరూ దీనిపై ఫోకస్ పెడుతున్నారు. దీనిని ‘పర్పుల్ గోల్డ్’ అని పిలుస్తారు. మరి.. ఈ లావెండర్ పంటతో ఎలాంటి లాభాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం... కాశ్మీర్ లో యాపిల్ సాగు ఎన్నో సంవత్సరాలుగా ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో వాతావరణంలో మార్పులు, మార్కెట్ ధరల్లో వచ్చే మార్పులు.. అడవి జంతువుల బెడద, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో చాలా మంది రైతులు ఈ పంటను పక్కన పెట్టేసి.. ప్రత్యామ్నాయ పంటల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో.. యాపిల్ తోటలను పక్కన పెట్టేసి.. లావెండర్ పంటలు వేయడం మొదలుపెట్టారు. లావెండర్ పంటకు ఇతర పంటలతో పోలిస్తే.. మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఒక్కసారి మొక్కలు నాటితే.. అనేక సంవత్సరాల పాటు దిగుబడి వస్తుంది. అంతేకాదు, ఈ లావెండర్ ఆకుల నుంచి ఎసెన్షియల్ ఆయిల్ కి దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ ఆయిల్ ని చాలా రకాల సుగంధ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, అరోమా థెరపీ, స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. లావెండర్ సాగు ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు.. ఈ ఆకుల నూనె ద్వారా అదనంగా ఆదాయం లభిస్తుంది. కేవలం పంటను మాత్రమే కాకుండా..దానితో తయారు చేసే ఉత్పత్తులు అమ్మడం ద్వారా కూడా రైతులు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ఈ ఆకులను కేజీ రూ. పదివేల వరకు అమ్ముతున్నారు. ఎక్కువ లాభాలు వస్తుండటంతో.. ఈ