
మీడియాటెక్ డైమెన్సిటీ 9500M ప్రాసెసర్‌తో వస్తుంది 6.83-అంగుళాల 2K ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా ఉండొచ్చు iQOO Neo 11 Ultra : వివో సబ్-బ్రాండ్ ఐక్యూ వచ్చే వారం కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ ఐక్యూ నియో 11 అల్ట్రా కీలక స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500M ప్రాసెసర్ ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ను ఐక్యూ నియో 11 సిరీస్ కోసం మీడియాటెక్‌తో కలిసి డెవలప్ చేసింది. ఐక్యూ నియో 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు, కీలక ఫీచర్లను షేర్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 2K ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లేను విజినోక్స్ F2 లూమినెసెంట్ మెటీరియల్‌తో రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2K రిజల్యూషన్‌తో టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ అల్ట్రా ఫోన్ డిస్‌ప్లే 2,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 98 శాతం ఫస్ట్ ఫ్రేమ్ బ్రైట్‌నెస్ రేషియో కూడా ఉంటుంది. ఈ డిస్‌ప్లే డేంజరస్ బ్లూ లైట్‌ను 5 శాతం తగ్గించి కంటి రక్షణను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ 2.0 అనే కొత్త ఫీచర్ కూడా ఉంది. మెరుగైన కంటి రక్షణ కోసం నేచురల్ లైటింగ్ అందిస్తుందని చెబుతున్నారు. Read Also : Honor Magic 9 Series : హానర్ మ్యాజిక్ 9 సిరీస్ వస్తోందోచ్.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో దుమ్మురేపనుందా? ఆగస్టు 18న చైనాలో లాంచ్ : ఐక్యూ నియో 11 అల్ట్రా ఆగస్టు 18న చైనాలో లాంచ్ కానుంది. ఇటీవలే ఐక్యూ నియో 11 అల్ట్రా MT6993M మోడల్ నంబర్‌తో చైనా టెలికాం వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో పాటు 12GB + 256GB, 12GB + 512GB, 16GB +






