డైరెక్టర్ పూరి కూతురిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ? ఫోటోస్ వైరల్
Actor ProfileActor

డైరెక్టర్ పూరి కూతురిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ? ఫోటోస్ వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డైరెక్టర్ పూరి కూతురిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ? ఫోటోస్ వైరల్
TV9 Telugu8 Dec 2026
డైరెక్టర్ పూరి కూతురిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ? ఫోటోస్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరోవైపు పూరీ కుమార్తె పవిత్ర మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరపై సందడి చేసిన పవిత్ర.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ నెట్టింట ఏదోక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె తనలోని అద్భుతమైన చిత్రకళా ప్రావీణ్యాన్ని (ఆర్టిస్టిక్ టాలెంట్) బయటపెడుతూ షేర్ చేసిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సాధారణంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ దేవుడిపై పెద్దగా నమ్మకం లేదనే విషయాన్ని తన 'మ్యూజింగ్స్' ద్వారా, పలు ఇంటర్వ్యూలలో తరచూ వెల్లడిస్తుంటారు. అయితే ఆయన కూతురు పవిత్ర మాత్రం శివునిపై ఎంతో ఆధ్యాత్మిక భావనను, భక్తిని పెంపొందించుకోవడం విశేషం. ఈ క్రమంలోనే తనకు కలలో కేదారనాథ్ శివుడు కనిపించాడని, ఆ ఆధ్యాత్మిక అనుభూతిని క్యాన్వాస్‌పై చిత్ర రూపంలోకి తెచ్చానని పవిత్ర తెలిపింది. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. తన చిత్రలేఖనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వివరిస్తూ.. "కొన్నేళ్ల క్రితం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే పెన్‌తో మండల (Mandala) చిత్రాలు గీయడం ప్రారంభించాను. ఇది నేను ఎక్కడో నేర్చుకున్న నైపుణ్యం కాదు, నాలో సహజంగా పుట్టుకొచ్చిన ఒక అభిరుచి. అయితే ఇటీవల కేదారనాథ్ ఆలయానికి సంబంధించిన ఓ అందమైన కల వచ్చింది. అది ఏదో సాధారణ కలలా అనిపించలేదు, సాక్షాత్తు శివుడే నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది. వెంటనే తర్వాతి రోజే కేదారనాథ్ ఆలయాన్ని మండల ఆర్ట్ శైలిలో గీయడం ప్రారంభించాను" అని పవిత్ర వెల్లడించింది. ఎక్కువ మంది చదివినవి

డ ర క టర ప ర క త ర ల ఈ ట ల ట క డ ఉ ద ఫ ట స వ రల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in