
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Absentee Teachers Termination Telangana: తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిపై విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండా వరుసగా సంవత్సరం పాటు విధులకు హాజరు కానట్లయితే.. అలాంటి వారిని సర్వీస్ నుంచి శాశ్వతంగా తెలిగించాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అంతేకాదు 5ఏళ్ల పాటు గైర్హాజరైన వారిని స్వచ్చందంగా ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తామంటూ విద్యాశాఖ తేల్చి చెప్పింది. పాఠశాలల్లో విద్య ప్రమాణాలను పెంచడం, విద్యార్థులకు క్రమం తప్పకుండా బోధన అందే విధంగా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం అమల్లోకి తీసుకువచ్చింది. బడులకు డుమ్మాలు కొట్టే టీచర్లపై చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత వహించినట్లయితే సంబంధిత అధికారులను కూడా విడిచిపెట్టబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగినట్లయితే.. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులనే బాధ్యులను చేస్తామంటూ హెచ్చరించింది. నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలిపింది. క్రమశిక్షాణారాహిత్యానికి తావులేకుండా ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిబంధనను కఠినతరం చేసినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. విదేశీ సర్వీసులో ఉండి గడువు ముగిసినా ఇంకా తిరిగి రానికి వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఇక నుంచి చర్యలు ప్రారంభించేందుకు వేచి చూడాల్సిన అవసరం లేదని గైర్హాజరులను గుర్తించిన వెంటనే షోకాజ్ నోటీసులు ఇచ్చి సీసీఎస్ రూల్స్ ప్రకారం విచారణ మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి డీఈఓ ఆఫీసులో గైర్హాజరు టీచర్ల కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్