
వైవిధ్యమైన పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు పొందిన స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్, ఇండస్ట్రీ హిట్ బాహుబలి మూవీని నిర్మించిన మేకర్స్‌తో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై తన తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమలు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచిన బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో కలిసి రూపొందిస్తున్నారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి కొత్త దర్శకుడు శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ కలసి ఈ ఆసక్తికరమైన, కంటెంట్ రిచ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వినోదాన్ని పంచుతూ ఆసక్తిని రేకెత్తించిన టీజర్ తర్వాత మేకర్స్ ‘కేకు వాకు’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాల భైరవ సంగీత సారథ్యంలో స్వరపరిచిన ఈ పాట సూరి అనే పాత్రను, అతని పిచ్చితనాన్ని ఓ ప్రత్యేకమైన సెటప్‌లో పరిచయం చేస్తుంది. కాల భైరవ, ఫహాద్ ఫాసిల్, స్సారా కలయికలో ఈ ప్రత్యేక మ్యూజిక్ వీడియోను మేకర్స్ రూపొందించారు. ముందు కూల్‌గా ప్రారంభమైన ఈ పాట..కాల భైరవ తన థంపింగ్ బీట్స్‌తో ఎంట్రీ ఇచ్చిన వెంటనే పూర్తి స్థాయి వాకీ మోడ్‌లోకి మారుతుంది. యువ సంగీత దర్శకుడు ఇచ్చిన ఈ ఎనర్జిటిక్ కంపోజిషన్ ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా ఆయన స్టెప్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. కాల భైరవ, ఎంసీ హరి కలిసి ఈ పాటకు క్యాచీ లిరిక్స్ అందించారు. సూరి డేర్‌డెవిల్ స్వభావాన్ని, అతనికి ప్రతి పని ఎంత ఈజీగా ‘కేక్‌వాక్’లా ఉంటుందనే విషయాన్ని చక్కటి పదాలతో హైలైట్ చేశారు. వీరిద్దరూ పాటను ఎనర్జీతో పాడుతూ మరింత స్పెషల్