డీఎస్పీ భీమ్ రెడ్డి డైరీలో టాలీవుడ్ హీరో పేరు
Actor ProfilePolitician

డీఎస్పీ భీమ్ రెడ్డి డైరీలో టాలీవుడ్ హీరో పేరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డీఎస్పీ భీమ్ రెడ్డి డైరీలో టాలీవుడ్ హీరో పేరు
TeluguOne24 Oct 2026
డీఎస్పీ భీమ్ రెడ్డి డైరీలో టాలీవుడ్ హీరో పేరు

డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భీమ్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో భీమ్ రెడ్డి వద్ద లభించిన వ్యక్తిగత డైరీలోని వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యుల పేర్లపై ఏయే ఆస్తులు రాశారనే వివరాలతో పాటు, తనకు రావాల్సిన డబ్బు, తాను ఇతరులకు చెల్లించాల్సిన మొత్తాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా డైరీలో నమోదైనట్లు అధికారులు గుర్తించారు. తాజాగా అదే డైరీలో ఓ టాలీవుడ్ హీరో గురించి ప్రస్తావన ఉండటం సంచలనంగా మారింది. డైరీలో నమోదైన వివరాల ప్రకారం ఆ హీరోకు రూ.3 కోట్ల అప్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత హీరోకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, భారీ మొత్తంలో ఆస్తులకు సంబంధించిన వివరాలు, వాటికి సంబంధించిన బినామీల పేర్లు కూడా డైరీలో నమోదై ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, డైరీలో పేర్లు ఉన్న బినామీలను ఒక్కొక్కరిని విచారించి వాస్తవాలను వెలికితీస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు రద్దు..! సుప్రీంకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జీలపైకి పేపర్లు విసిరిన పిటిషనర్..!

డ ఎస ప భ మ ర డ డ డ ర ల ట ల వ డ హ ర ప ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in