
హైదరాబాద్: భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢమాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంతోపాటు నగరవ్యాప్తంగా మహంకాళి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాలతో అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు.. పోతురాజుల నృత్యాలు.. అమ్మవారి నామస్మరణతో లాల్ దర్వాజా ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. నగర వ్యాప్తంగా ఆలయాల వద్ద 2,500 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంబర్‌పేట మహంకాళి అమ్మవారికి మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతక్కతో పాటు ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు