
Ravindra Jadeja : టెస్టుల్లో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 350 వికెట్లు పడగొట్టాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. లంక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేశర నువాంతను ఔట్ చేసి టెస్టుల్లో 350 వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. 2012లో టెస్టుల్లో అరంగ్రేటం చేసిన జడేజాకు ఇది 90వ మ్యాచ్. ఈ క్రమంలో భారత్ తరుపున టెస్టుల్లో 350 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా జడేజా నిలిచాడు. అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్‌లు జడ్డూ కన్నా ముందు ఈ ఘనత సాధించారు. టీమ్ఇండియా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే.. * అనిల్ కుంబ్లే - 619 వికెట్లు * రవిచంద్రన్ అశ్విన్ - 537 వికెట్లు * కపిల్ దేవ్ - 434 వికెట్లు * హర్భజన్ సింగ్ - 417 వికెట్లు నాలుగో ప్లేయర్‌గా.. టెస్టు క్రికెట్ చరిత్రలో 4 వేలకు పైగా పరుగులు చేసి 350 వికెట్లు పడగొట్టిన నాలుగో ప్లేయర్‌గా జడ్డూ ఘనత సాధించాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత డానియల్ వెటోరి, ఇయాన్ బోథమ్ లు ఉన్నారు. Basit Ali : పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు తీవ్ర గుండెపోటు.. 🚨 Milestone Alert 🚨#TeamIndia all-rounder Ravindra Jadeja completes 3⃣5⃣0⃣ wickets in Test cricket 🫡🫡 Sri Lanka lose their 7th wicket Updates ▶️ — BCCI (@BCCI) August 17, 2026 టెస్టుల్లో 4వేల కంటే ఎక్కువ పరుగులు, 350 ఫ్లస్ వికెట్లు తీసిన ప్లేయర్లు వీరే.. * కపిల్ దేవ్ (భారత్)- 5248 పరుగులు, 434 వికెట్లు * డానియల్ వెటోరి (న్యూజిలాండ్)