
తమిళనాడులోని అధికార టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా తిరుగుబావుటా ఎగురవేశాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యేల బేరసారాలు, ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం, క్యాబినెట్ సమావేశాల్లో అనధికార వ్యక్తుల ప్రమేయంపై జోక్యం చేసుకోవాలంటూ ప్రతిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ నేతలు శనివారం విడివిడిగా రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌ఎస్ భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టులు చేయడం, వేధింపులకు గురిచేయడం, పార్టీ మారేలా ఒత్తిడి తేవడం వంటి చర్యలకు అధికార పక్షం పాల్పడుతోందని ఆరోపించారు. అనంతరం ఆర్‌ఎస్ భారతి మాట్లాడుతూ.. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని జాన్, విష్ణురెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు మంత్రుల కంటే ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నారని మండిపడ్డారు. వారు ఉన్నత స్థాయి ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఇలాంటి దుస్థితి తమిళనాడులో ఎప్పుడూ లేదని అన్నారు. తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా ఆర్ రాధాకృష్ణన్ సహా డీఎంకే ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేసి, డబ్బు ఆశ చూపి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు.అంతేకాకుండా, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న సీఎం విజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గవర్నర్‌ను డీఎంకే కోరింది. ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసేలా విజయ్ స్వయంగా ఒప్పించే ప్రయత్నం చేశారని, రాబోయే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి ఆర్థిక







