
చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవలేదు. ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ ట్రెండ్ అవుతోంది. అదే “మ్యారేజ్ సెంటిమెంట్“. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలు లేదా స్టార్స్.. పెళ్లి తర్వాత బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్‌లో ‘కంబ్యాక్’ ఇస్తున్నారనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది.ఇటీవల కాలంలో ఈ సెంటిమెంట్‌ను నిజం చేస్తూ సాగిన కొందరు సెలబ్రిటీల జోడీలు మరియు వారి కంబ్యాక్ చిత్రాలను చూస్తే.. కిరణ్ అబ్బవరం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి పీటలు ఎక్కిన కొద్ది రోజులకే కిరణ్ నటించిన పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘క‘ విడుదలై భారీ వసూళ్లతో అద్భుతమైన విజయాన్ని అందుకొని కిరణ్ కెరీర్‌కు ఊహించని రీతిలో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. అక్కినేని నాగ చైతన్య వైవాహిక జీవితంలో కొత్త అడుగు వేస్తూ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, నటించిన రగ్గడ్ ఫిషర్‌మెన్ డ్రామా ‘తండేల్‘. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం నాగ చైతన్య నటనకు కెరీర్‌కు మైలురాయిగా నిలిచి సాలిడ్ కంబ్యాక్‌గా నిలిచింది. సమంత కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకులను అధిగమించి, కొత్త లైఫ్ మరియు మైండ్ సెట్‌తో కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టి తన సొంత బ్యానర్‌లో పవర్‌ఫుల్ గన్ పట్టి చేసిన మా ఇంటి బంగారం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. 100 కోట్ల వసూళ్లతో లేడి ఓరియెంటెడ్ సినిమాలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. జీవితంలో కొత్త స్పూర్తితో అడుగులు వేయడం ఆమెకు బాగా కలిసి వచ్చింది. అక్కినేని అఖిల్ ఇటీవల జైనబ్ రవ్‌జీని సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ‘ఏజెంట్’ వంటి భారీ పరాజయం తర్వాత