టాలీవుడ్ మన హీరోలదే.. మన జిల్లా హీరోలదే
Actor ProfilePolitician

టాలీవుడ్ మన హీరోలదే.. మన జిల్లా హీరోలదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాలీవుడ్ మన హీరోలదే.. మన జిల్లా హీరోలదే
Chitrajyothy15 Dec 2026
టాలీవుడ్ మన హీరోలదే.. మన జిల్లా హీరోలదే

రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలోఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రవితేజ (Raviteja) హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుక భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు భీమవరం పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో వేడుక మొత్తం అభిమానుల సందడితో మార్మోగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు (RRR) చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “రవితేజ నాకు కజిన్‌. చిన్నప్పటి నుంచే సినిమాలంటే అతడికి ఎంతో ఇష్టం. స్టార్‌ హీరో కావాలనే సంకల్పంతో ఎవరి అండదండలు లేకుండా తన సొంత కష్టంతో ఈ స్థాయికి ఎదిగాడు. అందుకే రవితేజ నాకు కేవలం హీరో మాత్రమే కాదు.. మా ప్రాంతానికి గర్వకారణం. మా జిల్లాకు చెందిన వ్యక్తి మాస్‌ మహారాజాగా ఎదిగి, ఇప్పుడు ఇదే గడ్డపై తన సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది” అని రఘురామ కృష్ణరాజు అన్నారు. భీమవరం వేదికగా ‘ఇరుముడి’ ట్రైలర్‌ విడుదల కావడం తనకు మరింత ప్రత్యేకమైన విషయమని ఆయన పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో, తనకు ఎంతో సన్నిహితమైన రవితేజ సినిమా వేడుక జరగడం ఒక మెమొరబుల్‌ మూమెంట్‌ అని చెప్పారు. ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉందని, ‘ఇరుముడి’ రవితేజ కెరీర్‌లో మరో పెద్ద విజయంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు ఉన్న సినీ ప్రత్యేకతను కూడా ఆయన గుర్తుచేశారు. “తెలుగు సినిమా అంటే ఒకప్పుడు కృష్ణా, గుంటూరు ప్రాంతాల ప్రభావం ఎక్కువగా కనిపించేది. కానీ మన పశ్చిమ గోదావరి గడ్డ కూడా ఎంతోమంది గొప్ప హీరోలను తెలుగు సినిమాకు అందించింది. కృష్ణంరాజు, ప్రభాస్‌, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రవితేజ

ట ల వ డ మన హ ర లద మన జ ల ల హ ర లద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in