
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Prithviraj Sukumaran Focus on Tollywood: మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కి తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు కాకుండా తనకంటూ ఒక సెపరేట్ జానర్ ప్రేక్షకులున్నారు. త్వరలో రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో వస్తోన్న ‘వారణాసి’ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో పృథ్వీరాజ్‌కు సంబంధించిన లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో హీరోగా నటించిన ‘ఐ, నోబడీ’ సినిమాను తెలుగులో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. నిస్సాం బషీర్ డైరెక్షన్‌లో పార్వతి తిరువోతు కథానాయికగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ జూలై 9న మలయాళంలో రిలీజ్ కానుంది. అదే సమయంలో జూలై 10వ తేదిన తెలుగులో విడుదల చేస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థలైన శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఉత్కంఠ భరితమైన కథ, కథనాలతో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించడం పక్కా అని చెబుతున్నారు. ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి రాజు జీవితంలో అనూహ్యంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా మొదలువుతుంది. భారీ బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అనివార్య పరిస్థితుల్లో హింసాత్మక మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది. అసలు