
Wasted Talent in Cricket: అసాధారణ ప్రతిభ, కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోవచ్చు. కానీ కొందరు ఆటగాళ్లు అపారమైన నైపుణ్యం ఉన్నప్పటికీ కోపం, ఫిట్‌నెస్ లేకపోవడం, చెడు అలవాట్ల వల్ల తమ కెరీర్‌ను తమ చేతులతోనే నాశనం చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్ అంతటి స్థాయికి చేరుకోవాల్సిన ప్రథ్వీ షా నుంచి వినోద్ కాంబ్లే వరకు ఇందుకు ఉదాహరణగా నిలిచారు. మైదానం బయట తప్పులు.. వినోద్ కాంబ్లే, ప్రవీణ్ కుమార్ పతనం.. భారత క్రికెట్ చరిత్రలో వినోద్ కాంబ్లే ఆరంభం ఒక సంచలనం. టెస్టుల్లో వరుసగా రెండు ద్విశతకాలు, మూడు శతాబ్దాలు బాదిన ఏకైక భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. చిన్న వయసులోనే వచ్చిన పేరు, డబ్బు అతడిని దారి తప్పించాయి. నైట్ లైఫ్, పార్టీల సంస్కృతికి అలవాటు పడి ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేయడంతో పాటు కోచ్‌లతో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల కెరీర్ ముగిసింది. మరోవైపు, స్వింగ్ బౌలింగ్‌తో లార్డ్స్ హానర్స్ బోర్డుపై పేరు సంపాదించిన ప్రవీణ్ కుమార్ కూడా అధికంగా మద్యం తాగడం, వీధి గొడవలు, అంపైర్లతో వివాదాల వల్ల క్రమశిక్షణ లేని ఆటగాడిగా ముద్రపడి కేవలం 25 ఏళ్లకే జట్టుకు దూరమయ్యాడు. ఎక్కువమంది చదివినది: ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..! క్రమశిక్షణారాహిత్యంతో చేజారిన ఆశలు.. జేసీ రైడర్, అహ్మద్ షజాద్.. న్యూజిలాండ్ జట్టులో తదుపరి బ్రెండన్ మెక్‌కలమ్ అవుతాడని భావించిన జేసీ రైడర్ అద్భుతమైన టైమింగ్‌తో గుర్తింపు పొందారు. కానీ లేట్ నైట్ పార్టీలు, ఆల్కహాల్ అలవాటు వల్ల టీమ్ మీటింగ్స్‌కు రాకపోవడం, ఊబకాయం బారిన పడటంతో పాటు నిషేధిత డ్రగ్స్ వాడి ఆరు నెలల నిషేధానికి గురయ్యారు. చివరకు 29 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అలాగే పాకిస్తాన్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సాధించిన అహ్మద్ షజాద్, పొగరుబోతు