పిల్లల టీకా సిఫార్సులకు సంబంధించిన ఒక కీలక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన నిలబడిన యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్స్ (ట్విట్టర్) సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె గురించి రకరకాలు కథనాలు ప్రచారం అవుతున్నాయి. ట్రంప్‌ను మెలకువగా ఉంచడానికి లేదా నిద్రలేపడానికి ఆయనకు ఆమె ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ మహిళ ఎవరు? అనే చర్చ తీవ్రంగా జరుగుతుండగా... ఆమె కన్జర్వేటివ్ మీడియా, లైఫ్‌స్టైల్ బ్రాండ్ 'ది కన్జర్వేటర్' వ్యవస్థాపకురాలు, సీఈఓ అయిన జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ అని అనేక మంది నెటిజన్లు, పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.ఓవల్ ఆఫీసులోని మీడియా సమావేశంలో తాను పొట్టపై చేయి వేసుకోవడాన్ని ట్రంప్‌ను నిద్రలేపేందుకు షాక్ ఇవ్వడానికి ఒక బటన్ నొక్కుతున్నట్టు చిత్రీకరించిన ప్రచారం చూసి ఫ్రాంక్లిన్ ఆశ్చర్యపోయారు. అటువంటి పోస్టులలో ఒకదానిని రీ-ట్వీట్ చేస్తూ.. తాను గర్భవతి అని, అందుకే పొట్టపై చెయ్యి వేసుకున్నానని క్లారిటీ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్, ఆరోగ్య- హ్యూమన్ సర్వీసెస్ శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీల మధ్య ఫ్రాంక్లిన్ నిలబడి ఉన్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ఆ సమయంలో ఆమె పదే పదే తల ఊపుతూ, తన చేతిని పొట్టపై ఉంచుకుని ఉన్నారు.పిల్లలకు టీకా డోసులను ఒకేసారి ఇవ్వకుండా వేర్వేరు సమయాల్లో ఇవ్వాలనే తన ఆలోచనను ప్రోత్సహించేలా, సవరించిన సిఫార్సులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఈ వీడియో రికార్డ్ అయింది. ఆ వెంటనే ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్‌తో కలిసి పాల్గొనడం తనకు దక్కిన గౌరవమని ఫ్రాంక్లిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఎవరీ జేమీ లీగ్ ఫ్రాంక్లిన్?న్యూస్‌వీక్ మ్యాగిజైన్ ప్రకారం.. నార్త్ కరోలినాకు చెందిన జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో మాజీ సిబ్బంది. బెర్కెలేలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి 2020లో
Actor ProfilePolitician
ట్రంప్ ను నిద్రలేపడానికి కరెంట్ షాక్ లు ఇస్తోందని తెగ ట్రోలింగ్.. స్పందించిన యువతి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•10 Dec 2026
ట్రంప్ ను నిద్రలేపడానికి కరెంట్ షాక్ లు ఇస్తోందని తెగ ట్రోలింగ్.. స్పందించిన యువతి