
యూఎస్ ప్లేయర్ బలోగన్‌పై ఉన్న ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా ఎత్తివేయడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం వెలువడిందన్న వార్తలు ప్రపంచ ఫుట్‌బాల్ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో రౌండ్ ఆఫ్ 32లో జరిగిన మ్యాచ్‌లో అమెరికా ఫుట్‌బాలర్ పోలారిన్ బలోగన్‌పై రిఫరీ రెడ్ కార్డ్ చూపించారు. దీంతో బెల్జియంతో జరిగే మ్యాచ్‌కు అతడిపై నిషేధం పడింది. అయితే బలోగన్‌పై ఉన్న ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా ఎత్తివేయడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం వెలువడిందన్న వార్తలు ప్రపంచ ఫుట్‌బాల్ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. దీంతో క్రీడల్లో రాజకీయ జోక్యంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి ఈ విషయంపై మాట్లాడారు. ‘బలోగన్‌కు రెడ్ కార్డు ఎందుకు ఇచ్చారు? ఎందుకు సస్పెన్షన్ విధించారు? అనే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినోతో మాట్లాడారు. అనంతరం అప్పీల్ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం అదనపు ఆధారాలు సమర్పించింది. స్వతంత్ర కమిటీ వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంది’ అని వెల్లడించారు. బోస్నియా-హెర్జెగొవినాపై జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 64వ నిమిషంలో ప్రత్యర్థిని కాలుతో అడ్డుకున్నందుకు బలోగన్‌కు రిఫరీ రెడ్ కార్డు చూపించారు. సాధారణంగా రెడ్ కార్డ్ అందుకున్న ప్లేయర్ ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఫిఫా క్రమశిక్షణ కమిటీ ఆ సస్పెన్షన్‌ను అమలు చేయకుండా నిలిపివేసింది. ఈ మేరకు అధికారికంగా ఆ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో బెల్జియంతో జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌కు బలోగన్ అందుబాటులోకి వచ్చాడు. ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌లో మూడు గోల్స్ చేసిన అతడు.. అమెరికాలో కీలక ఆటగాడిగా