
పశ్చిమ బెంగాల్‌ను వేధిస్తున్న అతిపెద్ద ప్రజారోగ్య సమస్య టీనేజ్ ప్రెగ్నెన్సీ (కౌమారదశలో గర్భం దాల్చడం) అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ శరద్వత్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశంలోనే బెంగాల్ అగ్రస్థానంలో ఉందని, ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు."టీనేజ్ ప్రెగ్నెన్సీ మాకు అతిపెద్ద ఆందోళన కలిగిస్తోంది. దురదృష్టవశాత్తు, బెంగాల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీన్ని నివారించడానికి మేము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం" అని మంత్రి తెలిపారు. ముర్షిదాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో, కొన్ని వర్గాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని, దీన్ని రాత్రికి రాత్రే పరిష్కరించలేమని ఆయన అన్నారు. ఈ సమస్యను సమూలంగా నిర్మూలించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరిస్తూ.. "ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక కమ్యూనిటీ డాక్టర్ల సహాయంతో ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాం. కుటుంబ సభ్యులతో మాట్లాడి అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలో అమలవుతున్న బాలల పరిరక్షణ విధానం కూడా నివారణ చర్యలకు దోహదపడుతుంది" అని ముఖర్జీ వివరించారు.టీనేజ్ గర్భాలను ఒక సామాజిక రుగ్మతగా అభివర్ణించిన మంత్రి, దీనిని తగ్గించడం తమ ప్రభుత్వానికి ఉన్న ప్రధాన సవాళ్లలో ఒకటని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, మాతృమరణాల రేటును తగ్గించడం వంటి ఇతర లక్ష్యాలతో పాటు దీనిపై కూడా దృష్టి