టాటా స్టాక్ దూకుడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా
Actor ProfilePolitician

టాటా స్టాక్ దూకుడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాటా స్టాక్ దూకుడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా- నిమిషాల్లోనే ఇన్వెస్టర్లకు రూ. 45 వేల కోట్లు లాభం
Samayam Telugu7 Nov 2026
టాటా స్టాక్ దూకుడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా- నిమిషాల్లోనే ఇన్వెస్టర్లకు రూ. 45 వేల కోట్లు లాభం

TCS Q1 Results : హర్ముజ్ జలసంధి కేంద్రంగా మరోసారి ఉద్రిక్తతలు చెలరేగడంతో అమెరికా- ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రూడాయిల్ ధరలు సోమవారం రోజు దాదాపు 5 శాతం వరకు పెరగ్గా స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి. జులై 13న ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో ఉదయం 11.40 గంటలకు సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా నష్టంతో 77,350 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 24130 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ మార్కెట్ నష్టపోతున్నా కొన్ని స్టాక్స్ రాణిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతుండగా టాటా గ్రూప్ దిగ్గజ ఐటీ కంపెనీ స్టాక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ముందుండి నడిపిస్తోంది. ఇంట్రాడేలో ఈ స్టాక్ ధర 6 శాతానికిపైగా పుంజుకుంది. గత శుక్రవారం రోజు టీసీఎస్ షేర్లు రూ. 2069 వద్ద ముగియగా సోమవారం సెషన్‌లో స్వల్ప లాభంతో రూ. 2075 వద్ద ఓపెన్ అయింది. తర్వాత స్వల్ప నష్టంతో రూ. 2065.10 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకినా తర్వాత వేగంగా పుంజుకుంది. నిమిషాల వ్యవధిలోనే 2, 3, 4 శాతం ఇలా పెరుగుతూ వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏకంగా 6.50 శాతం వరకు పెరిగి రూ. 2,199.90 వద్ద సెషన్ గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 2190 వద్ద ట్రేడవుతోంది.Read Also: టీసీఎస్‌కు మళ్లీ మంచి రోజులొచ్చినట్లేనా? భారీగా పెరిగిన ఉద్యోగులు- ప్రాంగణ నియామకాల జోరు! టీసీఎస్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 7.95 లక్షల కోట్లుగా ఉండగా ఇవాళ ఒక్కరోజే నిమిషాల వ్యవధిలో రూ. 45 వేల కోట్లకుపైగా పెరిగింది. ఈ మేరకు ఇన్వెస్టర్ల సంపద పెరిగిందన్నమాట. శుక్రవారం రోజు ముగిసే సరికి మార్కెట్ విలువ రూ. 7.48 లక్షల కోట్లుగానే ఉండేది. టీసీఎస్ షేర్లు ఈ స్థాయిలో పెరిగేందుకు ప్రధాన కారణం ఇటీవల క్యూ1