టాక్.. మరో బిగ్ మల్టీస్టారర్ లో వెంకీ మామ
Actor ProfileActor

టాక్.. మరో బిగ్ మల్టీస్టారర్ లో వెంకీ మామ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాక్.. మరో బిగ్ మల్టీస్టారర్ లో వెంకీ మామ
123Telugu2 Dec 2026
టాక్.. మరో బిగ్ మల్టీస్టారర్ లో వెంకీ మామ

ప్రస్తుతం వెంకీ మామ హీరోగా దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఆదర్శ కుటుంబం అలాగే అనీల్ రావిపూడి కలయికలో ఓ క్రేజీ మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాదిలోనే మెగాస్టార్ చిరంజీవితో భారీ మల్టీస్టారర్ గా కూడా మన శంకర వరప్రసాద్ గారు లో కనిపించి అదరగొట్టారు. ఇదిలా ఉండగా వెంకీ మామ మరో భారీ మల్టీస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇపుడు తెలుస్తుంది. అయితే ఈసారి అది కోలీవుడ్ స్టార్ హీరోతో అన్నట్టు టాక్. తమిళ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోస్ లో అజిత్ కుమార్ కూడా ఒకరు. రీసెంట్ గానే తన ఫ్యాన్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తర్వాత అనౌన్స్ చేసిన ‘డేర్ డెవిల్’ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలోనే వెంకీ మామ కీలక పాత్ర చేసే అవకాశం ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది కాలమే నిర్ణయించాలి