టబు రగ్గడ్ మాస్.. పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా హీరోయిన్.. స్లమ్ డాగ్ గ్లింప్స్ అదిరిపోయింది
Actor ProfilePolitician

టబు రగ్గడ్ మాస్.. పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా హీరోయిన్.. స్లమ్ డాగ్ గ్లింప్స్ అదిరిపోయింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టబు రగ్గడ్ మాస్.. పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా హీరోయిన్.. స్లమ్ డాగ్ గ్లింప్స్ అదిరిపోయింది
TV9 Telugu25 Nov 2026
టబు రగ్గడ్ మాస్.. పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా హీరోయిన్.. స్లమ్ డాగ్ గ్లింప్స్ అదిరిపోయింది

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘స్లమ్ డాగ్’. ‘33 టెంపుల్‌ రోడ్‌’ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. చాలా కాలం తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై మొదటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో అలనాటి స్టార్ హీరోయిన్, అగ్రనటి టబు చాలా కీలకమైన, పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇదివరకే అఫీషియల్ అనౌన్మెంట్ ఇచ్చిన మేకర్స్. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే డిప్యూటీ కమిషనర్ పాత్రను పోషిస్తున్నారు. నేడు ఈ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఒక గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో టబు లుక్ చాలా పవర్ ఫుల్‌గా, గంభీరంగా ఉంది. ముఖ్యంగా, “ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం..” అని ఆమె చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పోలీసు అధికారిణిగా టబు నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తాజా గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్.. పూరి జగన్నాథ్ సినిమాల్లో పాత్రలు ఎప్పుడూ చాలా స్టైలిష్‌గా, పవర్ ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ‘స్లమ్ డాగ్’లో టబు పాత్రను కూడా ఆయన చాలా వైవిధ్యంగా మలిచినట్లు కనిపిస్తోంది. విజయ్‌ సేతుపతి వంటి అద్భుతమైన నటుడితో, టబు వంటి స్టార్ నటి తోడవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టబు కెరీర్‌లో ఇదొక మరపురాని పాత్రగా నిలిచే అవకాశం