
ఈ ప్రక్రియ వల్ల పిటిషనర్ల హక్కులకు భంగం వాటిల్లదు స్పష్టం చేసిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈనాడు, అమరావతి: జీవీఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది మే 29న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సీజే నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. పునర్విభజన ప్రక్రియ చేపట్టడం వల్ల పిటిషనర్లకు దఖలుపడ్డ చట్టబద్ధమైన హక్కులకు భంగం వాటిల్లదని స్పష్టం చేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ఈ ఏడాది మే 17న జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై పిటిషనర్లు ఎలాంటి అభ్యంతరాలను దాఖలు చేయలేదని గుర్తుచేసింది. రాబోయే మూడు, నాలుగు వారాల్లో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేదని, సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యంలో ఈ నెల 11న వాదనలు వినిపిస్తామని అడ్వొకేట్ జనరల్(ఏజీ) చెబుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వ్యాజ్యాన్ని తేల్చాలని సింగిల్ జడ్జిని కోరింది. సింగిల్ జడ్జి వద్ద విచారణపై ఎలాంటి ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో జీవీఎంసీ కమిషనర్ వేసిన అప్పీల్‌లో లోతుల్లోకి వెళ్లి తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తంచేయడం లేదని స్పష్టత ఇచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. జీవీఎంసీ భౌగోళిక సరిహద్దులో మార్పు ఉండదు: అధికారుల తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘గతేడాది ఆగస్టు 13న సెన్సస్ కమిషనర్ ఇచ్చిన కార్యనిర్వాహక సూచనలు(ఎగ్జిక్యూటివ్ ఇన్‌స్ట్రక్షన్స్).. మున్సిపల్ పాలన, ఎన్నికల విషయంలో రాష్ట్రప్రభుత్వానికి ఉన్న రాజ్యాంగ, చట్టబద్ధమైన అధికారాలపై పైచేయి సాధించలేదు. ఈ ఏడాది మార్చి 24న జారీచేసిన జీవో 65కి అనుగుణంగా చేపట్టిన పునర్విభజన ప్రక్రియవల్ల జీవీఎంసీ పరిధిలోని ఏ గ్రామాన్ని, పంచాయతీని, మున్సిపాలిటీని, నగర పంచాయతీలను చేర్చడం లేదా మినహాయించడం జరగదు. జీవీఎంసీ భౌగోళిక సరిహద్దులో ఎలాంటి మార్పు ఉండదు. యథాతథంగా ఉంటుంది. సమాన ప్రాతినిధ్యం