ఏపీలో స్కూల్స్ స్టార్ట్ అయ్యాయంటే విద్యార్థులకు పండగే. ఒకటి చదువు పండగయితే.. ఇంకొకటి తల్లికి వందనం పండగ. ఈ పథకం డబ్బుల కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు అందించక ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు డబ్బులు కోల్పోతున్నారు. కళాశాల, స్కూలు యాజమన్యాలు కూడా పట్టించుకోకపోవడం.. సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఎంతో మంది తల్లికి వందనాన్ని పొందలేకపోతున్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం డబ్బులు జులై 15 నుంచి అర్హుల ఖాతాల్లో జమ కానుంది. అయితే, ఇప్పటి వరకు సగానికి పైగా విద్యార్థులకు ఖాతాలు లేకపోవడంతో సొమ్ము జమ కాలేదు. ఒక్క సత్యసాయి జిల్లాలోనే 2023 మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకోగా.. వాళ్లలో 763 మందే ఇప్పటి వరకు ఖాతాలు తెరిచారు. 869 మంది ఖాతాలు తెరిచినా ఎన్‌పీసీఐకి లింక్ చేసుకోలేదు. 431 మంది ఇంకా ఖాతానే తెరవలేదు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ. 15 వేలు అందజేస్తున్న క్రమంలో ఖాతా తెరవని కారణంగా రూ. 1.98 కోట్లు జమ కాని పరిస్థితి. READ ALSO పల్లెటూరి ప్రజలకు గుడ్ న్యూస్.. పాముకాటుకు ఇకపై108లోనూ మందు!ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే.. ప్రతి ఒక్క విద్యార్థి తమ పేరుతో ఒక ఖాతా తెరవాలి. ఎక్కడైనా సరే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీసు, బ్యాంకులలో కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీసుల్లో అయితే అకౌంట్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే ఎన్‌పీసీఐకి అనుసంధానం అవుతుంది. ఇతర జాతీయ బ్యాంకుల్లో కొంత ఆలస్యం అవుతుంది. పాన్ కార్డు లేకున్నా కూడా అకౌంట్ ఓపెన్ చేసే అవకాశాన్ని పోస్టాఫీసు కలిగిస్తోంది. ఒకప్పుడు పాన్ కార్డ్ ఉంటేనే అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం పాన్ కార్డు లేకున్నా విద్యార్థి ఆధార్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్, రూ. 200 ఉంటే ఈజీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంటర్
Actor ProfilePolitician
జులై 15న తల్లికి వందనం పథకం నిధులు.. ఈ పొరపాటు ఎవ్వరూ చేయొద్దు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•14 Oct 2026
జులై 15న తల్లికి వందనం పథకం నిధులు.. ఈ పొరపాటు ఎవ్వరూ చేయొద్దు