జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున
Actor ProfileActor

జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున
TV9 Telugu23 Sept 2026
జూలై 10న మనవాడు కొడుతున్నాడు.. లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రానికి నందు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. తిరుపతిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం అట్టహాసంగా జరిగ్గా.. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. కథ వినే సమయంలో ఇది ‘శ్రీరామాపురం’ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు చెప్పగానే తనకు ప్రత్యేక సెంటిమెంట్ కలిగిందని నాగార్జున గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే శ్రీరామాపురం అనేది అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) జన్మించిన ఊరు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక ‘మహాభారతం’ లాంటి కథ ఇదని, ఇందులో అద్భుతమైన మలుపులతో పాటు ఒక గొప్ప ప్రేమకథ కూడా ఉందని ఆయన వివరించారు. ఇప్పటివరకు ఎక్కువగా అర్బన్ (స్టైలిష్) పాత్రలు చేసిన అఖిల్, ఈ సీమ మట్టి కథకు సరిపోతాడా అని మొదట కొంచెం సందేహించానని నాగార్జున చెప్పుకొచ్చారు. అయితే, సినిమా చూశాక తన అనుమానాలన్నీ పటాపంచలయ్యాయని తెలిపారు. “సినిమా చూస్తున్నప్పుడు మీకు అఖిల్ ఎక్కడా కనిపించడు, కేవలం ‘లెనిన్’ మాత్రమే కనిపిస్తాడు. ఆ పాత్రలో అఖిల్ అంతగా లీనమైపోయాడు. థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులు లెనిన్ పాత్రను తమ గుండెల్లో దాచుకుని ఇంటికి తీసుకెళ్తారు” అని నాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సే (భారతి పాత్ర) నటనను నాగార్జున ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. భారతి పాత్ర ఈ సినిమాకు హార్ట్‌బీట్ లాంటిదని కొనియాడారు. అలాగే చిత్రంలో కీలక పాత్రలు పోషించిన శివాజీ, బ్రహ్మాజీ, సునీల్‌లతో తనకున్న పాత అనుబంధాన్ని నాగ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, నిర్మాత సూర్యదేవర నాగవంశీ (చింటూ) మాస్ పల్స్ తెలిసిన వ్యక్తని నాగార్జున ప్రశంసించారు. ఈ సినిమాపై నమ్మకంతోనే ఆయన ఆంధ్రప్రదేశ్ అంతటా స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని వెల్లడించారు. జూలై 10న విడుదల కాబోతున్న ఈ చిత్రం అక్కినేని అభిమానులకు మరియు మాస్ ప్రేక్షకులకు ఒక

జ ల 10న మనవ డ క డ త న న డ ల న న ప ర ర ల జ ఈవ ట ల న గ ర జ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in