జార్జియా మెలోనీ మంచిదే కానీ.. ఇరాన్ విషయంలో హ్యాండ్ ఇచ్చింది
Actor ProfilePolitician

జార్జియా మెలోనీ మంచిదే కానీ.. ఇరాన్ విషయంలో హ్యాండ్ ఇచ్చింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జార్జియా మెలోనీ మంచిదే కానీ.. ఇరాన్ విషయంలో హ్యాండ్ ఇచ్చింది
AP7AM7 Oct 2026
జార్జియా మెలోనీ మంచిదే కానీ.. ఇరాన్ విషయంలో హ్యాండ్ ఇచ్చింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీల మధ్య దౌత్యపరమైన విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. తుర్కియే రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇటలీ ప్రధాని మెలోనీ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. జార్జియా మెలోనీ మంచి వ్యక్తి అని, ఆమె అంటే తనకు అభిమానమని చెబుతూనే, ఇరాన్ విషయంలో అమెరికాకు సాయం చేసేందుకు నిరాకరించారని విమర్శించారు. ఈ నిర్ణయం కారణంగానే ఇరుదేశాల మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు.వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వ్యవహారంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు ఇటలీ నిరాకరించిందని ట్రంప్ వెల్లడించారు. అయినప్పటికీ తాము మెలోనీపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. అయితే ఇటలీ తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాకు సొంతంగా సరిపడా ఇంధన వనరులు ఉన్నందున తాము హర్మూజ్‌పై ఆధారపడటం లేదని, కేవలం దానిని వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంగా మాత్రమే చూస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో ఇటలీ తమకు అండగా నిలవనందు వల్లే తాను కొంత అసంతృప్తికి గురయ్యానని ఆయన ఒప్పుకున్నారు.మరోవైపు, ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సు నేపథ్యంలో ఇరునేతల మధ్య మొదలైన 'ఫొటో వివాదం' ఈ ఉద్రిక్తతలకు మరింత కారణమైంది. ఆ సదస్సులో తనతో ఫొటో దిగేందుకు మెలోనీ ప్రాధేయపడ్డారని, అందుకే తాను అంగీకరించానని ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపాయి. అయితే ట్రంప్

జ ర జ య మ ల న మ చ ద క న ఇర న వ షయ ల హ య డ ఇచ చ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in