
డీపీఆర్ పరిశీలనకు కేంద్రం చొరవ ఈనాడు, సిరిసిల్ల తంగళ్లపల్లి వద్ద సిరిసిల్ల-సిద్దిపేట రహదారి సిరిసిల్ల-సిద్దిపేట(ఎన్‌హెచ్ 365-బి) నాలుగు వరుసల రహదారి విస్తరణకు ముందడుగు పడింది. దుద్దెడ(సిద్దిపేట) వరకు భూసేకరణ ప్రక్రియలో రైతులు కొత్త మార్గాన్ని పరిశీలించడానికి సానుకూలంగా స్పందించారు. దీంతో దీని సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి దీపక్ షిండే పరిశీలించడానికి అంగీకరిస్తూ లేఖ పంపారు. సూర్యపేట వరకు విస్తరించిన ఈ రహదారిపై ఇప్పటికే జనగాం, సిద్దిపేట సమీపంలోని దుద్దెడ వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 54 కిలోమీటర్ల మేర పొడవున్న సిద్దిపేట-సిరిసిల్ల రోడ్డు పనులు రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-1లో దుద్దెడ(సిద్దిపేట) నుంచి సిద్దిపేట జిల్లా మల్యాల వరకు 27 కిలోమీటర్లు. ప్యాకేజీ-2లో మల్యాల నుంచి సిరిసిల్ల వరకు 27 కిలోమీటర్లు విస్తరణ పనులకు గతంలోనే కేంద్రం రూ.1100 కోట్లు విడుదల చేసింది. సిరిసిల్ల-వేములవాడ-కోరుట్లకు 35 కిలోమీటర్లు రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.139 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం వరకు 149 కిలోమీటర్ల జాతీయ రహదారికి డీపీఆర్ తయారీకి రూ.3.63 కోట్లు గతంలోనే కేటాయించారు. ఎన్‌హెచ్ విభాగం రహదారి ఎలా ఉంది? ఈ మార్గంలో విస్తరణకు ఉన్న అడ్డంకులపై అప్పుడే సర్వే చేసింది. సర్వే పత్రాలు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు, హైవే శాఖ(ఎంఓఆర్‌టీహెచ్-మోర్త్) పరిశీలనకు పంపారు. తర్వాత నుంచి ఎలాంటి చర్యలు లేవు. ఈ క్రమంలో 2018లో రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లతో కరీంనగర్-సిరిసిల్ల మార్గంలో నాలుగు వరుసల రహదారిని విస్తరించింది. ఇటు సిరిసిల్లలో రూ.100 కోట్లతో సిరిసిల్ల-కామారెడ్డి రెండో బైపాస్‌ను నిర్మించింది. కరీంనగర్-సిరిసిల్ల, సిద్దిపేట-సిరిసిల్ల రెండు మార్గాల్లోనూ వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ దారుల్లో ప్యాసింజర్ కోర్ యూనిట్(పీసీయూ) 40వేలు ఉంది. పది వేలలోపు పీసీయూ ఉంటేనే నాలుగు వరుసల