జాతీయ జెండాతో పాటు మీ అజెండా ఉండాలి
Actor ProfilePolitician

జాతీయ జెండాతో పాటు మీ అజెండా ఉండాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జాతీయ జెండాతో పాటు మీ అజెండా ఉండాలి
AP7AM21 Nov 2026
జాతీయ జెండాతో పాటు మీ అజెండా ఉండాలి

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం సాధించి, సమాజానికి సేవ చేయడమే నిజమైన దేశభక్తి అని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... గిరిజన సమాజానికి సమగ్ర అభివృద్ధి, సంక్షేమంపై పలు కీలక హామీలు ఇస్తూ, వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.ప్రతి వ్యక్తి ఒక శక్తి.. ద్రౌపది ముర్ము ఆదర్శంసాధారణ ఆదివాసీ కుటుంబంలో పుట్టి, అనేక కష్టాలను అధిగమించి, దేశ ప్రథమ పౌరురాలిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చంద్రబాబు అన్నారు. ఆమె స్ఫూర్తితో గిరిజన యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. జాతీయ జెండాతో పాటు మీ అజెండా కూడా ఉండాలని పిలుపునిచ్చారు."సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ద్రౌపది ముర్ము, అబ్దుల్ కలాం, బీఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్, నరేంద్ర మోదీ వంటి మహనీయులంతా సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారే. ‘నేను ఏంటి? ఎలా ఎదగాలి? ఈ సమాజానికి, దేశానికి నేనేం ఇవ్వాలి?’ అనే లక్ష్యంతో పనిచేయాలి. మీ విజయం దేశ విజయమవుతుంది.." అని ఆయన పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని వ్యాపింపజేసేందుకు ఆగస్టు 9