జేఎన్ టీయూలో మహామాయలు
Actor ProfileCelebrity

జేఎన్ టీయూలో మహామాయలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జేఎన్ టీయూలో మహామాయలు
Andhra Jyothy2 Oct 2026
జేఎన్ టీయూలో మహామాయలు

6 వేల సర్టిఫికెట్లు మాయం విచారణ నివేదికపై గోప్యత చక్రంతిప్పిన కీలక అధికారిపై చర్యలు శూన్యం చాంతాడంత పాపాల చిట్టా ఉన్నా ఉన్నత పదవులు వైసీపీ ముద్ర ఉన్నా కూటమి ప్రభుత్వం పెద్దపీట అనంతపురం: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో మాయలు కాదు.. మహామాయలు చేస్తున్నారు. వర్సిటీలో చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అందజేయాల్సిన సర్టిఫికెట్లు మాయమయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 వేల సర్టిఫికెట్లు మాయమయ్యాయి. కాదు.. కాదు.. మాయంచేశారు. ఎక్కడికెళ్లాయో తెలియదు. ఎవరు చేశారో వర్సిటీలో అందరికీ తెలిసినా.. చర్యల్లేవు. ఒక్కో సర్టిఫికెట్‌ను మార్కెట్‌లో పెట్టి లక్షల రూపాయలకు విక్రయించారని వర్సిటీలో కోడై కూస్తున్నారు. అయినా చర్యల్లేవు. ఇంతస్థాయిలో బరితెగించి అక్రమాలకు పాల్పడినా పట్టించుకోరెందుకో? విచారణ కమిటీ అన్నారు. ఆ తర్వాత ఆ ఊసే మరిచారు. కమిటీ విచారణ చేసింది నిజం.. ఏం తేల్చిందో గోప్యం. నివేదికను కాకులెత్తుకెళ్లాయో.. ఏమో.. మరి. ఏళ్లు గడుస్తున్నా చర్యల్లేవు. వర్సిటీలో సర్టిఫికెట్ల మిస్సింగ్‌తోపాటు భారీ అక్రమాలకు కేంద్ర బిందువైన అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఉన్నత పదవులు కట్టబెట్టడం శోచనీయం. గత వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలా పనిచేసిన ఆ అధికారికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయడం మరీ విచిత్రం. వర్సిటీల్లో ప్రక్షాళన చేపట్టిన కూటమి ప్రభుత్వానికి జేఎన్‌టీయూ అవినీతి తిమింగళం కనిపించకపోవడం మహా విచిత్రం. జేఎన్‌టీయూలో పరీక్షల విభాగం కీలకం. వర్సిటీ పరిధిలో చదివిన విద్యార్థుల భవితవ్యం ఆ విభాగంపైనే ఆధారపడి ఉంటుంది. విద్యార్థి పాస్‌... ఫెయిల్‌ నిర్ణయించేది ఆ విభాగంలోని అధికారులే. అలాంటి కీలక విభాగంలో రూ.లక్షలు, రూ.కోట్లలో అవినీతి జరుగుతోందనడంలో సందేహం లేదు. ఇందుకు గతంలో ఆ విభాగంలో జరిగిన భారీ అక్రమాలే నిదర్శనం. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అందించే ఓడీ, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్ల గోల్‌మాల్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఈ వ్యవహారం వర్సిటీని కుదిపేసింది. అయినా సర్టిఫికెట్ల మిస్సింగ్‌ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఆ

జ ఎన ట య ల మహ మ యల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in