
జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నెల 18వ తేదీన జీఆర్ఎంబీ 18వ సమావేశం జరగనుంది. హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నెల 18వ తేదీన జీఆర్ఎంబీ 18వ సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రాజెక్టులపై మూడు అంశాలు అజెండాలో పెట్టడంపై అభ్యంతరం తెలిపింది. సమ్మక్క బ్యారేజీకి అనుమతులు నిలిపివేయాలనే అంశాన్ని తొలగించాలని కోరింది. తెలంగాణ ప్రాజెక్టుల TAC అనుమతుల వివరాల అంశం కూడా వద్దని తెలిపింది. CWC-TAC, MoJS ఇచ్చిన అనుమతుల సమీక్ష అంశంపైనా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై ఇప్పటికే జీఆర్ఎంబీలో విస్తృతంగా చర్చించామని వెల్లడించింది. గతంలో ఏపీ అభ్యంతరాలను CWC పరిశీలించి తిరస్కరించిందని తెలంగాణ సర్కార్ వాదించింది. GWDT అవార్డు, CWC మార్గదర్శకాల ప్రకారమే ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. మూడు అంశాలను అజెండా నుంచి డ్రాప్ చేయాలని జీఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. సవరించిన అజెండా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల POB రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దు: మంత్రి పొంగులేటి