జహీరాబాద్ లో 3
Actor ProfilePolitician

జహీరాబాద్ లో 3

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జహీరాబాద్ లో 3,245 ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. 2 లక్షల మందికి ఉపాధి
Samayam Telugu6 Jan 2027
జహీరాబాద్ లో 3,245 ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. 2 లక్షల మందికి ఉపాధి

తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. జహీరాబాద్‌లో 3,245 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ పారిశ్రామిక వాడలో భారీగా పెట్టుబడులను ఆకర్షించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ పారిశ్రామిక నగరంలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు, కార్యకలాపాలు ప్రారంభమైతే సుమారు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల శాఖ మంత్రులు పాల్గొన్నారు.జహీరాబాద్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)కి అందించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ విధానంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని.. నిర్ణయించిన గడువులోనే పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ జహీరాబాద్ పారిశ్రామిక నగరంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇప్పటికే నీటి సరఫరా పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని.. విద్యుత్ సరఫరా పనులను కూడా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.ఈ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం భూమి రూపంలో 51 శాతం వాటా కలిగి ఉండగా.. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను

జహ ర బ ద ల 3 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in