జమ్మూ కాశ్మీర్ సంచలన నిర్ణయం.. వీరమరణం పొందిన పోలీసులకు రూ.12 లక్షలు
Actor ProfilePolitician

జమ్మూ కాశ్మీర్ సంచలన నిర్ణయం.. వీరమరణం పొందిన పోలీసులకు రూ.12 లక్షలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జమ్మూ కాశ్మీర్ సంచలన నిర్ణయం.. వీరమరణం పొందిన పోలీసులకు రూ.12 లక్షలు, సైనికులకు రూ.25 లక్షల పరిహారం
Samayam Telugu12 Dec 2026
జమ్మూ కాశ్మీర్ సంచలన నిర్ణయం.. వీరమరణం పొందిన పోలీసులకు రూ.12 లక్షలు, సైనికులకు రూ.25 లక్షల పరిహారం

Jammu Kashmir Revised Ex-Gratia Norms : ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగంగా పోరాడుతూ.. దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్న భద్రతా బలగాల సిబ్బంది కుటుంబాలకు బిగ్ రిలీఫ్ కల్పించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. వీరికి మాత్రమే కాకుండా ఉగ్ర ఘటనల వల్ల ప్రభావితమైన సామాన్య పౌరులకు మరింత అండగా నిలిచేందుకు కూడా సిద్ధమైంది. ముఖ్యంగా భద్రతా సంబంధిత వ్యయం కింద అందించే ఎక్స్‌గ్రేషియా, నష్టపరిహార నిబంధనలను సమూలంగా సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను అధికారికంగా నోటిఫై చేసింది. దీని ప్రకారం.. వీరమరణం పొందిన డిఫెన్స్, పారామిలటరీ జవాన్లకు రూ.25 లక్షలు, అమరులుగా మారిన పోలీసులకు రూ.12 లక్షల నష్టపరిహారాన్ని అందించనున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.సైనికులు, పారామిలటరీ బలగాలకు రూ.25 లక్షలుసరిహద్దుల్లో లేదా ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు అందించే నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. జమ్మూ కాశ్మీర్ స్థానికులైన డిఫెన్స్ లేదా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బంది ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో వీరమరణం పొందితే.. ఆ ఘటన రాష్ట్రం లోపల జరిగినా లేదా వెలుపల జరిగినా.. వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఒకవేళ స్థానికేతరులైన జవాన్లు జమ్మూ కాశ్మీర్ భౌగోళిక సరిహద్దుల్లో జరిగిన ఉగ్ర ఘటనల్లో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది.పోలీసు అమరవీరులకు ఆర్థిక భరోసారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తూ.. సిబ్బంది వీరమరణం పొందితే వారి కుటుంబాలకు మొత్తం రూ.12 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తారు. ఇందులో రూ.7 లక్షలు పోలీసు వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేయగా.. మిగతా రూ.5 లక్షలను జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి అందజేస్తారు. అలాగే యాక్షన్‌లో ప్రాణాలు కోల్పోయే ప్రత్యేక పోలీసు అధికారులకు అందించే నష్టపరిహారాన్ని రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఉగ్ర దాడుల్లో తీవ్ర గాయాలపాలై శాశ్వత

జమ మ క శ మ ర స చలన న ర ణయ వ రమరణ ప ద న ప ల స లక ర 12 లక షల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in