జపాన్ లో మిరాయ్’ జోరు.. ధురంధర్ 2
Actor ProfileActor

జపాన్ లో మిరాయ్’ జోరు.. ధురంధర్ 2

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జపాన్ లో మిరాయ్’ జోరు.. ధురంధర్ 2, బాహుబలి 2ను దాటేసిన తేజ సజ్జ సినిమా
Chitrajyothy19 Jan 2027
జపాన్ లో మిరాయ్’ జోరు.. ధురంధర్ 2, బాహుబలి 2ను దాటేసిన తేజ సజ్జ సినిమా

తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమాకు జపాన్‌లో భారీ స్పందన లభిస్తోంది. డే-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో ధురంధర్ 2, బాహుబలి 2, టైగర్ జిందా హై వంటి సినిమాలను దాటేసింది. హీరో తేజ సజ్జ (Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai) సినిమాకు జపాన్ (Japan)లో భారీ స్పందన లభిస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. జపాన్‌లో తొలి రోజు అడ్వాన్స్‌ బుకింగ్స్ పరంగా ఇప్పటికే ‘ధురంధర్ 2’ (Dhurandhar2), ‘టైగర్ జిందా హై’, బాహుబలి 2 (Baahubali2) వంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం జపాన్‌లో అత్యధిక డే-1 అడ్వాన్స్‌ బుకింగ్స్ సాధించిన టాప్-10 భారతీయ చిత్రాల జాబితాలో ‘మిరాయ్’ ఏడో స్థానంలో కొనసాగుతోంది. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు సమయం ఉండటంతో ఈ ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తేజ సజ్జ గతంలో ‘హనుమాన్’ (HanuMan) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా విజయంతో ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ‘మిరాయ్’తో అంతర్జాతీయ మార్కెట్లలోనూ తన పరిధిని మ‌రింత‌గా విస్తరిస్తున్నారు. విభిన్నమైన కథలు, భారీ స్థాయి జానర్ సినిమాలను ఎంచుకుంటూ తేజ సజ్జ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. జపాన్‌లో ‘మిరాయ్’కు వస్తున్న స్పందన చూస్తుంటే ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మంచి ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి

జప న ల మ ర య జ ర ధ ర ధర 2 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in