
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Jana Nayagan Release Date: విజయ్ ఎన్నికల ముందు ‘జన నాయగన్’ తన చివరి చిత్రం అని చెప్పారు. మరి ఈ మాటపై నిలబడతారా అనేది పక్కనపెడితే.. ఎపుడో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా సెన్సార్ పూర్తైయింది. ఇక ఈ సినిమాకు రిలీజ్‌కు ఉన్న పెద్ద అడ్డంకి తొలిగిపోయింది. కానీఈ సినిమా రిలీజ్‌కు ముఖ్యమంత్రిగా విజయ్ చెప్పిన కండిషన్స్ ఇతరత్రా కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను నిర్మించిన KVN ప్రొడక్షన్స్ వాళ్లు ఈ సినిమాను ఇప్పటికే కోటి మందికి పైగా పైరసీలో చూసారని ఆయన తరఫు న్యాయవాదులే చెప్పారు. విజయ్ కెరీర్ మొత్తంలో ఓ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఇంతగా వేచి చూడలేదనే చెప్పాలి. జన నాయగన్ మాత్రం అంతగా వెయిట్ చేయిస్తుంది ఫ్యాన్స్‌ను. ఇక సెన్సార్ వాళ్లు దాదాపు 12 కట్స్‌తో అనుమతులు ఇచ్చారు. సెన్సార్ పూర్తైయినా.. జూలై 24 రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. పొలిటికల్‌గా తనదైన ముద్ర వేస్తున్నారు విజయ్. కానీ ఆయన చివరి సినిమా ‘జన నాయగన్’ బయటికి రానంటూ నిన్న మొన్నటి వరకు మొరాయించింది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తుంటే.. విజయ్ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం సినిమాను దెబ్బతీయడానికి కుట్రలపై కుట్రలు చేసారనేది బహిరంగ రహస్యం. అయితే ‘జన నాయగన్’ చిత్రం రిలీజ్‌కు విజయ్ కొన్ని కండీషన్స్ పెట్టారని