జననాయగన్' సినిమాకు సెన్సార్ కత్తెర
Actor ProfileCelebrity

జననాయగన్' సినిమాకు సెన్సార్ కత్తెర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జననాయగన్' సినిమాకు సెన్సార్ కత్తెర, ఏకంగా 12 సీన్లు కట్.. నిడివి ఎంతంటే
Asianet News Telugu27 Oct 2026
జననాయగన్' సినిమాకు సెన్సార్ కత్తెర, ఏకంగా 12 సీన్లు కట్.. నిడివి ఎంతంటే

తమిళ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్ 'జననాయగన్'(జన నాయకుడు) సినిమా సెన్సార్ అడ్డంకులను దాటి 'A' సర్టిఫికెట్ పొందింది. కానీ ఈ సర్టిఫికెట్ కోసం చిత్ర బృందం సెన్సార్ బోర్డు (CBFC)తో పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. సినిమాలోని రాజకీయ అంశాల తీవ్రత చూసి, కథాగమనాన్ని మార్చే స్థాయిలో సెన్సార్ బోర్డు చాలా సన్నివేశాలను తొలగించింది. సినిమాలోని భారీ రాజకీయ నిరసనలు, పోరాట సన్నివేశాల నిడివిని శాంతిభద్రతల కారణాలతో తగ్గించారు. ఫైట్ సీన్స్‌లో హింస ఎక్కువగా ఉండటంతో, థియేటర్లలో టెన్షన్ పుట్టించే చాలా షాట్స్‌ను కత్తిరించారు. రక్తపు మరకలు, క్రూరమైన దాడుల నిడివిని సగానికి తగ్గించారు. పాత్రలు మాట్లాడే పరుషమైన మాటలన్నింటినీ మ్యూట్‌ చేసి మ్యూట్ చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సెన్సార్ సమస్యలు ముగిశాయి. దీంతో 'జననాయగన్' కొత్త రిలీజ్ డేట్ ప్రకటన ఎప్పుడైనా రావొచ్చని కోలీవుడ్ వర్గాలు, విజయ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ ఇప్పటికే పైరసీకి గురయ్యింది. మిలియన్‌కిపైగా జనం చూశారని టాక్‌. మరి ఇప్పుడు థియేటర్లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి