
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Son in law attacks on mother In law in jagtial: సాధారణంగా దంపతుల మధ్య వివాదాలు రావడం కామన్. చాలా మంది వీటిని మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. కానీ కొంత మంది చిన్న చిన్న విషయాలకు గొడవల్ని పెద్దది చేసుకుని డైవర్స్ వరకు వెళ్లిపోతారు. అంతే కాకుండా దాడులు చేయడం లేదా సుపారీ గ్యాంగ్ లతో హత్యలు చేయించడానికి సైతం వెనుకాడటంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగిత్యాల జిల్లా పట్టణం గాంధీ నగర్ లో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా దుమారంగా మారింది. జగిత్యాల పట్టణంలో గాంధీనగర్ లో ఉన్న ఒక అల్లుడు ప్రశాంత్.. ఇల్లు ఊడుస్తున్న తన అత్త నర్సవ్వపై కత్తితో దాడి చేశాడు. కొన్ని రోజులుగా అల్లుడు, కూతురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనికి తన అత్త నర్సవ్వ కారణమని అల్లుడు కోపం పెంచుకున్నాడు. అదను కోసం చూసి ఆదివారం తెల్లవారుజామున ఇల్లుడుస్తున్న అత్తపై కత్తితో దాడి చేశాడు. Read more: KTR: ప్రభుత్వంకు అసలు సోయి ఉందా..?.. కంటి వెలుగు పథకంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. పలు చోట్ల ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో అత్త ఒక్కసారిగా షాక్ అయ్యింది. గట్టిగా అరుపులు పెట్టడంతో చుట్టుపక్కల వారు రావడంతో అతగాడు పరుగులు పెట్టాడు. వెంటనే గాయపడ్డ నర్సవ్వను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్