ఛత్తీస్ గఢ్ సమ్మతించేనా
Actor ProfilePolitician

ఛత్తీస్ గఢ్ సమ్మతించేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఛత్తీస్ గఢ్ సమ్మతించేనా
Eenadu1 Oct 2026
ఛత్తీస్ గఢ్ సమ్మతించేనా

గోదావరి-కావేరి అనుసంధానంలో పీటముడి ఆ రాష్ట్ర మిగులు జలాలపై ‘దక్షిణాది’ ఆశలు ఈనాడు, హైదరాబాద్‌: గోదావరి-కావేరి అనుసంధానంలో తమ నీటిని వినియోగించుకోవడానికి ఛత్తీస్‌గఢ్‌ అంగీకరిస్తుందా.. లేదా... అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ అనుసంధానం చేపట్టడానికి ముందే ఆ రాష్ట్రం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరముందని జూన్‌లో జరిగిన నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి అంగీకారం తీసుకున్న తర్వాతే ముందుకెళ్తామని టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ ప్రకటించారు. ఒకవైపు జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాలు ఈ అనుసంధానంపై చర్చిస్తుండగా, అసలు ఛత్తీస్‌గఢ్‌ అంగీకరిస్తుందా, అంగీకరించకపోతే పరిస్థితి ఏంటన్న చర్చ ప్రారంభమైంది. ఐదారేళ్లుగా ప్రతి టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలోనూ దీనిపై చర్చ జరుగుతున్నా అడుగు ముందుకు పడలేదు. నదుల అనుసంధానంలో భాగంగా మొదట 247 టీఎంసీల మళ్లింపుతో గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టాలని నిర్ణయం జరిగింది. మొదట ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి మళ్లించాలని, తర్వాత జనంపేట నుంచి మళ్లించాలనే ప్రత్యామ్నాయంపైనా చర్చ జరిగింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక ముసాయిదాను అన్ని రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలను కోరారు. అయితే గోదావరిలో మిగులు జలాలు లేవని, తమ భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలుగు రాష్ట్రాలు స్పష్టం చేయడంతో పథకంలో మార్పు జరిగింది. ఇంద్రావతి సబ్‌ బేసిన్‌లో భూపాలపట్నం వరకు 273 టీఎంసీలు ఛత్తీస్‌గఢ్‌కు గోదావరి ట్రైబ్యునల్‌ కేటాయించింది. ఈ నీటిని ఛత్తీస్‌గఢ్‌ పూర్తిగా వినియోగించుకోలేదని, ఇందులో 147 టీఎంసీలతో గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టాలని టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయించి డీపీఆర్‌ కూడా సిద్ధం చేసింది. దీనికి రూ.64 వేల కోట్ల వరకు ఖర్చవుతుందనీ అంచనా వేసింది. నీటి మళ్లింపు పరిమాణాన్ని తగ్గిస్తే కర్ణాటకకు వాటా ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆ రాష్ట్రాన్ని ఒప్పించేందుకు బెడ్తి-వార్ధా అనుసంధానాన్ని కూడా ఇందులో భాగం చేసింది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్‌డబ్ల్యూడీఏ(నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) సమావేశంలో సమక్క-సారక్క బ్యారేజి నుంచి అనుసంధానాన్ని చేపట్టాలనే ప్రతిపాదన సైతం వచ్చింది. దేవాదుల ప్రాజెక్టు