చిల్లర లేదని మంత్రి’నే దిగిపొమ్మన్న కండక్టర్ .. చివరకు
Actor ProfilePolitician

చిల్లర లేదని మంత్రి’నే దిగిపొమ్మన్న కండక్టర్ .. చివరకు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిల్లర లేదని మంత్రి’నే దిగిపొమ్మన్న కండక్టర్ .. చివరకు
Eenadu3 Nov 2026
చిల్లర లేదని మంత్రి’నే దిగిపొమ్మన్న కండక్టర్ .. చివరకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్‌.. బెంగళూరులో ఆర్టీసీ బస్సు (RTC Bus) సేవలపై ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్‌ ధరించిన ఆయన.. సాధారణ ప్రయాణికుడి మాదిరిగా నగరంలో పలు రూట్‌లలో అర్ధరాత్రి ప్రయాణించి రవాణా సేవలను పరిశీలించారు. ఈ క్రమంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ కండక్టర్‌, మరో డ్రైవర్‌ను సస్పెండ్‌ చేయాలని సిఫార్సు చేశారు. తనిఖీల్లో భాగంగా బస్సు ఎక్కిన మంత్రి.. కండక్టర్‌కు రూ.100 ఇచ్చి రెండు టికెట్లు ఇవ్వమన్నాడు. అయితే, కండక్టర్‌ మాత్రం తన వద్ద సరిపడా చిల్లర లేదని చెబుతూ బ్యాగును చూపించాడు. అక్కడితో ఆగకుండా, ఒకవేళ చిల్లర లేకుంటే బస్సు దిగి పోవాలని మంత్రికి సూచించాడు. వియత్నాం ఘటన.. సకాలంలో సీపీఆర్‌ చేసి ఉంటే మరింత మంది బతికేవారు! ఓ స్టాప్‌లో ప్రయాణికుడు చేయి ఎత్తి బస్సు ఆపాలని సంజ్ఞ చేసినా, డ్రైవర్‌ ఆపకుండా ముందుకు వెళ్లిపోవడాన్ని మంత్రి గమనించారు. క్షేత్రస్థాయిలో ఆర్టీసీ సిబ్బంది తీరును గమనించిన ఆయన.. ఓ కండక్టర్‌, ఓ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

చ ల లర ల దన మ త ర న ద గ ప మ మన న క డక టర చ వరక Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in