చిరంజీవి బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్.. వందల మంది ఫైటర్లతో మెగా యాక్షన్ సీక్వెన్స్
Actor ProfileActor

చిరంజీవి బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్.. వందల మంది ఫైటర్లతో మెగా యాక్షన్ సీక్వెన్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిరంజీవి బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్.. వందల మంది ఫైటర్లతో మెగా యాక్షన్ సీక్వెన్స్
Samayam Telugu4 Oct 2026
చిరంజీవి బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్.. వందల మంది ఫైటర్లతో మెగా యాక్షన్ సీక్వెన్స్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో సాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో 'మెగా 158' మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. కొంత టాకీతో పాటు కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్ చేశారు. ఇటీవలే హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ వీడియోని కూడా పంచుకుంది. అయితే ఈ షెడ్యూల్ లో ప్రస్తుతం ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ఈ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ సారధ్యంలో ఈ భారీ యాక్షన్‌ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో వందల మంది ఫైటర్స్ పాల్గొంటున్నారు. చిరంజీవి రిస్క్‌తో కూడిన స్టంట్స్ చేస్తున్నారని, మునుపెన్నడూ చూడని విధంగా ఈ సీక్వెన్స్ తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. చిరు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కనిపించని ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తారని చెబుతున్నారు. ఈ సీన్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని, బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్ అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. 'మెగా 158' నుంచి చిరంజీవి లుక్ బయటకు రాకుండా దర్శకుడు బాబీ జాగ్రత్త పడుతున్నారు. బ్లడీ బెంచ్ మార్ అంటూ మెగాస్టార్ ను కొత్త కోణంలో చూస్తారని హింట్ ఇస్తున్నారు కానీ.. ఆయన లుక్ మాత్రం రివీల్ చేయడం లేదు. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు

చ ర జ వ బ గ గ స ట య క షన ఫ స ట ల డ గ వ దల మ ద ఫ టర లత మ గ య క షన స క వ న స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in