హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఇలా పాత్ర ఏదైనా తనదైన సహజ నటనతో ప్రాణం పోసే విలక్షణ నటుడు శివాజీ . దాదాపు పదమూడేళ్ల విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, వరుస విజయవంతమైన ప్రాజెక్టులతో వెండితెరపై మళ్లీ సందడి చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కష్టకాలంలో ఎదురైన అనుభవాలతో పాటు మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మెగాస్టార్ vs సూపర్ స్టార్... బాక్సాఫీస్ వద్ద చిరంజీవి - రజనీకాంత్ మధ్య ‘డబుల్ క్లాష్’!ఇంటి అద్దె కట్టలేని స్థితిలో చిరంజీవి చేసిన సాయంతాను చిన్నప్పటి నుంచీ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానినని శివాజీ తెలిపారు. సినీ జీవితం తొలినాళ్లలో చిరంజీవితో కలిసి 'మాస్టర్' చిత్రంలో నటించే అపురూప అవకాశం తనకు దక్కిందని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ, కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న విషయం చిరంజీవి గారికి తెలియగానే నన్ను దగ్గరకు పిలిచి, నా చేతిలో పదివేల రూపాయల నోట్ల కట్ట పెట్టారు. ఆ రోజు ఆయన చేసిన ఆ సాయం నా మనసును ఎంతగానో కదిలించింది. ఆ సంఘటనే నాలో సేవాభావాన్ని పెంచింది. ఇప్పటికీ ఇతరులకు చేతనైన సాయం చేస్తున్నానంటే దానికి ఆయనే స్ఫూర్తి. ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయనకు విలన్‌గా నటించాలన్నదే నా జీవితంలో అతిపెద్ద కోరిక" అని శివాజీ తన మనసులోని మాటను బయటపెట్టారు.* ఫస్ట్ డేని మించి సెకండ్ డే కలెక్షన్ల సునామీ... సూర్య కెరీర్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రేర్ రికార్డ్నరసరావుపేట నుంచి వెండితెర వరకు..నరసరావుపేటలోని ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన శివాజీ, ప్రారంభంలో ఎడిటర్‌గా, యాంకర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు విభాగాల్లో పనిచేశారు. 'శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి' చిత్రంలో స్నేహితుడి పాత్రతో నటన ప్రారంభించి 'శ్రద్ధాంజలి'తో హీరోగా మారారు
Actor ProfileActor
చిరంజీవి చేసిన రూ.10వేల సాయం జీవితంలో మర్చిపోను.. ఆయనకు విలన్ గా నటించడమే నా డ్రీమ్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•30 Dec 2026
చిరంజీవి చేసిన రూ.10వేల సాయం జీవితంలో మర్చిపోను.. ఆయనకు విలన్ గా నటించడమే నా డ్రీమ్