చిరు అభిమానులకు చేదు వార్త... ముఠా మేస్త్రి రావడం లేదు
Actor ProfileActor

చిరు అభిమానులకు చేదు వార్త... ముఠా మేస్త్రి రావడం లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిరు అభిమానులకు చేదు వార్త... ముఠా మేస్త్రి రావడం లేదు
Chitrajyothy22 Jan 2027
చిరు అభిమానులకు చేదు వార్త... ముఠా మేస్త్రి రావడం లేదు

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 21న రీ-రిలీజ్ కావాల్సిన ముఠా మేస్త్రి సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే తెలియచేస్తారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎ. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన సినిమా 'ముఠా మేస్త్రి'. ప్రముఖ నిర్మాతలు కె.సి. శేఖర్ బాబు, శివప్రసాద్‌ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మీనా, రోజా హీరోయిన్లుగా నటించిన 'ముఠా మేస్త్రి'కి రాజ్ - కోటి సంగీతం అందించారు. 1993 జనవరి 17న విడుదలైన ఈ సినిమా శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా మ్యూజికల్ హిట్ గానూ నిలిచింది. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'ముఠా మేస్త్రి' చిత్రాన్ని చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 21న విడుదల చేయాలని భావించారు. అయితే అనుకున్న విధంగా ఫైనల్ 4కె అవుట్ పుట్ అందకపోవడంతో ఈ సినిమా రీ-రిలీజ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పటికే విడుదలైన 'ముఠామేస్త్రి' రీ-రిలీజ్‌ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, మరింత భారీగా, మరింత మెరగ్గా, మరితం గ్రాండియర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. మ్యాడ్ కాంబో.. కార్తీక్‌ సుబ్బరాజ్‌తో వరుణ్‌ తేజ్‌! రెండో పెళ్లికి సిద్దమైన మొగలిరేకులు సీరియల్ నటి శిరీష